Hardik Pandya: హోటల్లో లవర్‌తో దొరికిపోయిన పాండ్యా!
టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంటేనే స్టైల్, యాటిట్యూడ్.. ఇప్పుడు దానికి 'కాంట్రవర్సీ' కూడా తోడైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతుంటే, అందరూ ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉంటే.. మనోడు మాత్రం వాలెంటైన్స్ డే మూడ్‌లో మునిగిపోయాడు. కొలంబోలోని ఒక లగ్జరీ హోటల్ లాబీలో తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కలిసి హార్దిక్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నిజానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం.. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ప్లేయర్స్ తమ ఫ్యామిలీ మెంబర్స్‌ని లేదా పార్ట్‌నర్స్‌ని వెంట ఉంచుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల సమయంలో 'నో ఫ్యామిలీ' పాలసీని బోర్డు స్ట్రిక్ట్‌గా అమలు చేస్తోంది. కానీ, హార్దిక్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ కోసం గర్ల్‌ఫ్రెండ్‌ను ఏకంగా కొలంబోకే రప్పించేశాడు. ఇది చూసిన నెటిజన్లు "మ్యాచ్ ముఖ్యం భయ్యా.. ముచ్చట్లు కాదు" అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Hardik Pandya మెడపై 'M' టాటూ..
ఇక ఈ కాంట్రవర్సీకి ఆజ్యం పోస్తూ హార్దిక్ మెడపై ఒక కొత్త టాటూ దర్శనమిచ్చింది. ఇంగ్లీష్ అక్షరం 'M' ని తన మెడ వెనుక భాగంలో పర్మనెంట్‌గా వేయించుకున్నాడు. ఇది తన లేడీ లవ్ 'మహిక' పేరులోని మొదటి అక్షరమేనని క్లారిటీ వచ్చేసింది. గతంలో తన మాజీ భార్య నటాషా కోసం కూడా ఇలాగే టాటూలు వేయించుకున్న హార్దిక్, ఇప్పుడు అంతకంటే స్పీడ్‌గా కొత్త రిలేషన్‌లో దూసుకుపోతుండటం హాట్ టాపిక్‌గా మారింది.
ఆట కంటే ప్రేమే ప్రాధాన్యమా?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హార్దిక్ మాట్లాడుతూ.. "ఆమె నా జీవితంలోకి వచ్చాక అన్నీ శుభాలే జరుగుతున్నాయి.. నా సక్సెస్ క్రెడిట్ ఆమెదే" అంటూ ఓపెన్‌గా చెప్పేశాడు. అయితే, పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ముందు ఇలా లవర్‌తో టైమ్ పాస్ చేయడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. "గ్రౌండ్‌లో పెర్ఫార్మెన్స్ ఇస్తావా? లేక హోటల్ లాబీలో విన్యాసాలు చేస్తావా?" అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ వ్యవహారంపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా? లేక హార్దిక్ తన ఆటతో అందరి నోళ్లు మూయిస్తాడా? అనేది చూడాలి!
🚨Questions are being raised over the BCCI’s policy after Indian cricketer Hardik Pandya was reportedly seen with actress Mahieka Sharma at the team hotel during the ICC Men’s #T20WorldCup.
— Backchod Indian (@IndianBackchod) February 14, 2026
pic.twitter.com/wICGastCTl
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications