icc world cup 2023: ఈసారి వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్టులు వీరేనా..!

భారత్ ఆతిధ్యమిస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సగం మ్యాచ్ లు ముగిశాయి. మరో సగం మ్యాచ్ లు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ప్రథమార్ధం ముగిసి ద్వితీయార్ధంలోకి అడుగుపెడుతున్నామన్నమాట. అయితే ఇన్ని మ్యాచ్ లు మిగిలున్నా సెమీ ఫైనలిస్టులు ఎవరంటే సగటు క్రికెట్ అభిమానులు ఇట్టే చెప్పేస్తున్నారు. ద్వితీయార్ధంలో అద్భుతాలు జరిగితే తప్ప సెమీఫైనల్ కు వెళ్లే నాలుగు జట్లు దాదాపు ఖరారైనట్లే.

వన్డే వరల్డ్ కప్ లో మొత్తం 48 మ్యాచ్ లు ఉన్నాయి. ఇందులో నిన్న జరిగిన ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మ్యాచ్ తో 24 మ్యాచ్ లు ముగిశాయి. ఇవాళ ఇంగ్లండ్-శ్రీలంక మధ్య 25వ మ్యాచ్ జరగబోతోంది. ఇవాళ మ్యాచ్ కూడా పూర్తయితే ఇంగ్లండ్, శ్రీలంక సహా అన్ని జట్లూ ఐదేసి మ్యాచ్ లు పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. ఇక ప్రతీ ఒక్కరికీ మిగిలినవి నాలుగేసి మ్యాచ్ లే. ఈ నాలుగు మ్యాచ్ లలో ఆయా జట్లు అద్భుతాలు చేస్తే తప్ప ప్రస్తుతం వారి ఆటతీరును బట్టి సెమీ ఫైనలిస్టులు ఎవరో ఇట్టే చెప్పేయవచ్చు.

here is the list of semi-final probables in icc world cup 2023

ప్రస్తుతం వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో ఆడిన మ్యాచ్ ల్లో అన్నీ గెలిచిన భారత్ 10 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ ఆడిన ఐదేసి మ్యాచ్ ల్లో నాలుగేసి గెలిచి చెరో 8 పాయింట్లతో రెండు, ముూడు స్ధానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ లు గెలిచిన ఆస్ట్రేలియా 6 పాయింట్లతో నాలుగో స్ధానంలో ఉంది. అలాగే ఈ పాయింట్ల పట్టికలో టాప్ 4 స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు దూసుకెళ్లడం ఖాయం.

మరోవైపు 4 పాయింట్లతో ఐదో స్ధానంలో ఉన్న పాకిస్తాన్, అదే 4 పాయింట్లతో ఐదో స్ధానంలో ఉన్న ఆప్ఘనిస్తాన్ తాము ఆడే మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిచినా గరిష్టంగా సాధించే పాయింట్లు 12 మాత్రమే. అదే టాప్ 4 లో ఉన్న నాలుగు జట్లూ తమ మిగిలిన 4 మ్యాచ్ ల్లోనూ గెలిస్తే సాధించే గరిష్ట పాయింట్లు 16-18 మధ్య ఉంటాయి. దీంతో సదరు నాలుగు జట్లు భారత్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాకు సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

అలా కాకుండా ప్రస్తుతానికి టాప్ 4లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లు తమ తదుపరి 4 మ్యాచ్ ల్ని ఓడిపోవడం లేదా ఒకట్రెండు మ్యాచ్ లు ఓడి, ఐదారు స్ధానాల్లో ఉన్న పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ జట్లు తమ తదుపరి మ్యాచ్ ల్లో నాలుగింటినీ లేదా కనీసం మూడింటిని గెలిస్తే మాత్రం పోరు రసవత్తరంగా మారుతుంది. అయితే పాక్, ఆప్ఘన్ జట్లలో తాజా ఫామ్, ఇప్పటివరకూ నమోదు చేసిన గణాంకాలను బట్టి చూస్తే మాత్రం వీరిలో పాకిస్తాన్ కు మాత్రమే నాలుగో స్ధానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీ ఫైనల్ బెర్తు సాధించే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+