ఇండియా అంటే చాలు.. రెచ్చిపోతాడీ కావ్యా పాప ఫేవరెట్ ప్లేయర్: ఇంకో సెంచరీ

Travis Head: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని ప్రతిష్ఠాత్మక గబ్బా స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రారంభంలో వెంటవెంటనే మూడు వికెట్లను కోల్పోయినప్పటికీ- ఆ తరువాత కుదురుకుంది. తెగించి ఆడుతోంది. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. టీ విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది ఆసీస్.

స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. మరోసారి రెచ్చిపోయాడు. సెంచరీ బాదాడు. రెండో టెస్ట్‌లో కూడా అతను సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో 140 పరుగులు బాదాడు. ఇప్పుడు ఇంకోసారి 100 మార్క్‌ను అధిగమించాడు. 103 పరుగులతో క్రీజ్‌లో నిలిచాడు. మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ 65 పరుగులతో ఆడుతున్నాడు.

IND vs AUS Century for Travis Head in 3rd test in Gabba against India

వర్షం వల్ల తొలి రోజు అర్ధాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. 28 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు క్రీజ్‌లో అడుగు పెట్టారు ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ. ప్రారంభంలోనే జస్‌ప్రీత్ బుమ్రా వీరిద్దరినీ బలి తీసుకున్నాడు. అద్భుతమైన స్వింగ్ బంతులతో పెవిలియన్ దారి పట్టించాడు.

మార్నుస్ లంబుషేన్ కూడా ఎంతో సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో స్లిప్స్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్స్‌కు దూరంగా వేసిన ఫుల్లర్‌ను డ్రైవ్ చేయబోయాడు లంబుషేన్. ఆ బంతి కాస్త బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ వైపు దూసుకెళ్లింది. సెకెండ్ స్లిప్‌లో ఉన్న కోహ్లీ దాన్ని షార్ప్‌గా అందుకున్నాడు. దీనితో 74 పరుగుల వద్ద మూడు వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా.

దీనితో పూర్తిగా మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్టయింది గానీ.. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అడ్డుకున్నారు. చెలరేగి ఆడుతున్నారు. ప్రత్యేకించి- ట్రావిస్ హెడ్ వన్డే ఫార్మట్‌లో దుమ్ము లేపాడు. 116 బంతుల్లోనే వంద పరుగులు చేశాడంటే అతని స్పీడ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 13 బౌండరీలు ఉన్నాయి. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ తల మీదుగా కొట్టిన ఫోర్.. హైలైట్.

భారత్ అంటే రెచ్చిపోతాడీ బ్యాటర్. భారత్‌పై ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో రెండు, ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌‌లో సెంచరీ అందుకున్నాడు. బీజీటీ ట్రోఫీలో తొలి టెస్ట్‌లో 89 పరుగులతో రాణించాడు. రెండో టెస్ట్‌లో 140 బాదాడు. ఇప్పుడు మరోసారి ఆ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు ట్రావిస్ హెడ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+