IPL 2024: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు ? మార్ క్రమ్ వారసుడెవరో ?

గత ఐపీఎల్ సీజన్లో ఎదురైన వరుస పరాజయాల నుంచి కోలుకుని కొత్త సీజన్ మొదలుపెట్టేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. గత సీజన్లో కెప్టెన్ గా ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఐడెన్ మార్ క్రమ్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో సన్ రైజర్స్ పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్కృమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కెప్టెన్సీ మార్పు విషయంలో సన్ రైజర్స్ మల్లగుల్లాలు పడుతోంది.

అయితే సన్ రైజర్స్ జట్టులో కెప్టెన్సీ చేపట్టగలిగే ఆటగాళ్లు పలువురు ఉన్నారు. ఇప్పటికే తమ జాతీయ జట్ల తరఫున మెరుగైన ప్రదర్శనతో రాణిస్తుండటంతో పాటు కెప్టెన్సీ చేపట్టగలిగే సామర్ధ్యం కూడా ఉన్న ముగ్గురు ఆటగాళ్లు సన్ రైజర్స్ కు బెస్ట్ ఆప్షన్లుగా కనిపిస్తున్నారు. వీరిలో ఎవరిని ఈసారి కెప్టెన్సీ వరించబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే అసలు వీరెవరినీ కాదని మార్ క్రమ్ ను సన్ రైజర్స్ కొనసాగించినా ఆశ్చర్యం లేదనే సంకేతాలు అందుతున్నాయి.

IPL 2024: options before sunrisers hyderabad for replacement of aiden markram as captain

మార్ క్రమ్ కాకపోతే సన్ రైజర్స్ జట్టులో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టగలిగే సత్తా ఉన్న ముగ్గురు ఆటగాళ్లను ఓసారి పరిశీలిద్దాం.గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక కావడంతో పాటు ఆస్టేలియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్ లు అందించిన పాట్ కమ్మిన్స్ ఇప్పుడు సన్ రైజర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో రూ.20.50 కోట్లకు యాజమాన్యం కమ్మిన్స్ ను కొనుగోలు చేసింది.

కమ్మిన్స్ తర్వాత గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ కూడా మరో ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ఆల్ రౌండర్ గా రాణిస్తున్న ట్రావిస్ హెడ్.. ఆసీస్ వైస్ కెప్టెన్ గానూ ఉన్నాడు. గతంలో బిగ్ బాష్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీర్ఘకాలిక అవసరాల బట్టి చూస్తే సన్ రైజర్స్ కు ట్రావిస్ హెడ్ బెస్ట్ ఆప్షన్. అలాగే భారత మాజీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఈ రేసులో ఉన్నాడు. గతంలో సన్ రైజర్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించిన భువీ.. గత సీజన్ లో మార్ క్రమ్ జట్టుతో చేరకముందు కెప్టెన్ గా జట్టును నడిపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+