దేవుడా.. ఓ మంచి దేవుడా: వాన పడకుండా చేయవా
IPL 2024 RCB Playoffs chances: ఐపీఎల్ 2024 సీజన్ ముగింపుకొచ్చేసింది. లీగ్స్ దశలో ఇంకొన్ని మ్యాచ్‌లే మిగిలివున్నాయి. ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే తమ చివరి మ్యాచ్‌లు ఆడేశాయి. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్.. తమ చివరి గేమ్‌లో తలపడనున్నాయి.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు లైఫ్ అండ్ డెత్ గేమ్ ఇది. ఇందులో గెలిచిన జట్టే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే దాని ప్రస్థానం 12 పాయింట్ల వద్దే స్తంభించిపోతుంది. గెలిస్తే మాత్రం ఆసక్తికరంగా మారతాయి ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు. ఆర్సీబీ పాయింట్లు కూడా 14కు చేరుకుంటాయి. ఢిల్లీ కేపిటల్స్‌తో సమానంగా నిలుస్తుంది.
ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్‌రేట్‌ను అధిగమించేలా ఆర్సీబీ గెలవాల్సి ఉంటుంది. డీసీ నెట్ రన్‌రేట్ మైనస్ 0.377. ఆర్సీబీ నెట్ రన్‌రేట్ 0.387. సీఎస్‌కే నెట్ రన్‌రేట్ 0.528. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. లేదా.. చెన్నై నిర్దేశించే లక్ష్యాన్ని 18.1 ఓవర్లల్లో ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే నెట్ రన్‌రేట్ మెరుగుపడుతుంది.
ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌లో వరుస పరాజయాలను చవి చూసిన ఈ టీమ్.. సెకెండాఫ్‌లో విజృంభించింది. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఎక్కడో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న దశ నుంచి 12 పాయింట్ల వరకు నిరాఘాతంగా సాగింది ఆర్సీబీ ప్రయాణం. అడ్డొచ్చిన జట్టును తొక్కుకుంటూ వెళ్లింది.
ఇప్పుడు ప్లేఆఫ్స్ ముగింట్లో నిలిచింది. ఇదొక్కటీ మంచి రన్‌రేట్‌తో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటూ కోరుకోని అభిమాని లేడు. చేయని పూజలు లేవు. బెంగళూరులో కొన్ని ఆలయాల్లో ప్రత్యేెక పూజలు చేశారు అభిమానులు. భారీగా బైక్ ర్యాలీనీ నిర్వహించారు.
Early Morning Bike Road Show From #RCB Fans Outside The Stadium...💥
— Sachin Roberrt😎 (@SachinRoberrt7) May 18, 2024
Whatever Happens Today...Give Your Best @RCBTweets @imVkohli ✌🏻#RCBvsCSK pic.twitter.com/lCB3afugjP
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆర్సీబీకి చేటే. చెరో టీమ్‌కు ఒక్కో పాయింట్ లభిస్తుంది. 13 పాయింట్ల వద్దే ఆర్సీబీ తన ప్రస్థానాన్ని ముగించాల్సి వస్తుంది. ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలగుతుంది. 15 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరుకుంటోంది. నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్లేఆఫ్స్ వెళ్లిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications