ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు?
IPL 2024 RCB Playoffs chances: ఐపీఎల్ 2024 సీజన్ ముగింపుకొచ్చేసింది. లీగ్స్ దశలో ఇంకొన్ని మ్యాచ్‌లే మిగిలివున్నాయి. ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే తమ చివరి మ్యాచ్‌లు ఆడేశాయి. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్.. తమ చివరి గేమ్‌లో తలపడనున్నాయి.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు లైఫ్ అండ్ డెత్ గేమ్ ఇది. ఇందులో గెలిచిన జట్టే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే దాని ప్రస్థానం 12 పాయింట్ల వద్దే స్తంభించిపోతుంది. గెలిస్తే మాత్రం ఆసక్తికరంగా మారతాయి ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు. ఆర్సీబీ పాయింట్లు కూడా 14కు చేరుకుంటాయి. ఢిల్లీ కేపిటల్స్‌తో సమానంగా నిలుస్తుంది.
ఢిల్లీ కేపిటల్స్ నెట్ రన్‌రేట్‌ను అధిగమించేలా ఆర్సీబీ తన ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. డీసీ నెట్ రన్‌రేట్ మైనస్ 0.377. ఆర్సీబీ నెట్ రన్‌రేట్ 0.387. సీఎస్‌కే నెట్ రన్‌రేట్ 0.528. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. లేదా.. చెన్నై నిర్దేశించే లక్ష్యాన్ని 18.1 ఓవర్లల్లో ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే నెట్ రన్‌రేట్ మెరుగుపడుతుంది.
ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డు పడే అవకాశాలు లేకపోలేదు. కొద్దిరోజులుగా బెంగళూరులో ప్రతి రోజూ సాయంత్రం వర్షం పడుతూనే వస్తోంది. ఈ సాయంత్రం వర్షం పడటానికి 87 శాతం అవకాశాలు ఉన్నట్లు వెదర్ పోర్టల్.. అక్యు వెదర్ అంచనా వేసింది. ఉదయం 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రానికి 23 డిగ్రీల వరకు పడిపోవచ్చు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదు అవ్వొచ్చని పేర్కొంది.
వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే చెరో టీమ్‌కు ఒక్కో పాయింట్ లభిస్తుంది. 13 పాయింట్ల వద్దే ఆర్సీబీ తన ప్రస్థానాన్ని ముగించాల్సి వస్తుంది. ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలగుతుంది. 15 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరుకుంటోంది. నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్లేఆఫ్స్ వెళ్లిన విషయం తెలిసిందే.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications