క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐపీఎల్ స్టార్

IPL 2024: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. మార్చి 22వ తేదీన ఈ సీజన్ ఆరంభం కానుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది.

ఐపీఎల్ ఆడే అన్ని జట్లు కూడా సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరిగిన వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు. కొత్త సారథులు వచ్చారు. ఓ మోస్తరు ప్లేయర్లు భారీ రేటు పలికారు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలారు.

IPL 2024 Shahbaz Nadeem has announced his retirement from Cricket

ఐపీఎల్ టోర్నమెంట్ సమీపించిన వేళ.. ఓ స్టార్ ప్లేయర్ క్రికెట్‌కు దూరం అయ్యాడు. టాప్ క్లాస్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థొడాక్స్ స్పిన్ బౌలర్ షాబాజ్ నదీం రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మట్ల నుంచి వైదొలిగాడు. రంజీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకొంటోన్నట్లు తెలిపాడు. టీ20 లీగ్ మ్యాచ్‌లల్లో కొనసాగుతానని పేర్కొన్నాడు.

టీమిండియా తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు షాబాజ్. 2019లో రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు గానీ ఎంతో కాలం కొనసాగలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. 2021లో చెన్నైలో ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్ట్‌లోనూ మెరిశాడు. ఆ మ్యాచ్‌లో కూడా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

IPL 2024 Shahbaz Nadeem has announced his retirement from Cricket

ఒకప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌లో 72 మ్యాచ్‌లను ఆడాడు. 2011 నుంచి 2021 వరకు క్రమం తప్పకుండా ఐపీఎల్‌ టోర్నమెంట్లల్లో రాణించాడు. 72 మ్యాచ్‌లల్లో 48 వికెట్లు పడగొట్టాడు. 3/16 అతని బెస్ట్ బౌలింగ్. 2022, 2023 సీజన్‌లల్లో అన్ సోల్డ్‌గా మిగిలాడు.

రంజీల్లో సత్తా చాటాడు షాబాజ్. 2015-16, 2016-17 సీజన్‌లల్లో రంజీల్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌ అతనే. జార్ఖండ్‌ ఫస్ట్ క్లాస్ ఫార్మట్‌లో 416 వికెట్లు కూల్చాడు. ఆ తరువాత ఫామ్ కోల్పోవాల్సి రావడంతో ఐపీఎల్‌ ప్రయాణానికి బ్రేక్ పడింది. తాజాగా క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+