Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2024: రోహిత్ కు ఆల్రెడీ 36... హార్దిక్ కు కెప్టెన్సీ కరెక్టే- తేల్చేసిన సన్నీ గవాస్కర్

ఈసారి ఐపీఎల్ సీజన్ కు సర్వం సిద్దమవుతోంది. అన్ని జట్లూ ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో జరిగే ఈ టోర్నీ కోసం ఇప్పటికే జట్లను ఎంపిక చేసుకున్న ఫ్రాంచైజీలు.. వారి నుంచి తుది జట్టు కూర్పుల కోసం కసరత్తు కూడా ప్రారంభించేశాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలగింపుపై మాత్రం ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే రోహిత్ తొలగింపుపై క్రికెట్ ప్రపంచంలో భిన్న స్పందనలు వస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలో ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలగింపును దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ కూడా అయిన సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ సమర్ధించాడు. ముంబై జట్టు దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే అన్నాడు. ప్రస్తుతం రోహిత్ వయస్సు 36 ఏళ్లని, కాబట్టి భవిష్యత్ అవసరాల రీత్యా ముంబై జట్టు ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని సన్నీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ తొలగింపు ఈ సీజన్ లో ముంబైకి మేలు చేస్తుందన్నాడు. తద్వారా హార్దిక్ పాండ్యా ఎంపికను కూడా గవాస్కర్ సమర్ధించాడు.

IPL 2024: sunil gavaskar justified rohit sharmas removal from mumbai indians captaincy

ఐపీఎల్ 2024కి రోహిత్ స్థానంలో పాండ్యాను కెప్టెన్‌గా నియమించాలన్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్ణయం సరైనదేనా అన్న ప్రశ్నకు బ్యాటింగ్ దిగ్గజం గవాస్కర్ స్పందిస్తూ.. ఇటీవల ముంబై శిబిరంలో నాయకత్వంలో మార్పు ఎందుకు వచ్చిందో వివరించాడు. వారు ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తారని, రోహిత్ శర్మకు ఇప్పటికే 36 ఏళ్లు వచ్చాయని, మూడు ఫార్మాట్‌లకు భారత కెప్టెన్‌గా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. కాబట్టి ముంబై ఆ భారాన్ని కొంత తగ్గించి, ఆ బాధ్యతను జట్టుపై ఇవ్వాలని ప్రయత్నించారన్నాడు.

హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగించడం ముంబై ఇండియన్స్ కు కచ్చితంగా ప్రయోజనం చేస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ముంబై ఇప్పుడు రోహిత్‌కి స్వేచ్ఛగా వెళ్లి ఆర్డర్‌లో అగ్రస్థానంలో తన ఆట ఆడుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చారన్నాడు. హార్దిక్ తర్వాత నెం.3 లేదా నెం.5 తో కలిసి రోహిత్ ఆడే అవకాశం ఉంటుందన్నాడు. ఇలాంటి పరిస్ధితుల్లో టీమ్ కచ్చితంగా 200 ప్లస్ స్కోర్లను సాధించే అవకాశం ఉంటుందన్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+