తుఫాన్ ముందు ప్రశాంతత- దాని పేరే..!!

Rohit Sharma: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ గుడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ టీమ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. నైట్‌రైడర్స్ హోమ్ పిచ్‌ ఈడెన్ గార్డెన్స్‌ దీనికి వేదిక.

2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. తన హోమ్‌ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. 27వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్, 12న పంజాబ్ కింగ్స్, 23న ముంబై ఇండియన్స్, మే 5న ఢిల్లీ కేపిటల్స్, 10న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి.

Rohit Sharma

మార్చి 23వ తేదీన అంటే రెండో రోజున తన తొలి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మళ్లీ మే 20వ తేదీన ఈ రెండు జట్లూ మరోసారి తలపడతాయి. మార్చి 8వ తేదీన చెపాక్ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది సీఎస్‌కే. మళ్లీ మే 3వ తేదీన ఈ రెండు జట్లూ ఢీ కొడతాయి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో.

మార్చి 29న గుజరాత్, 31న కోల్‌కత నైట్ రైడర్స్, ఏప్రిల్ 3న లక్నో సూపర్ జెయింట్స్, 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 13న ఢిల్లీ కేపిటల్స్, 17న సన్‌రైజర్స్ హైదరాబాద్, 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లను ఆడనుంది ముంబై ఇండియన్స్. దీనితో తొలి రౌండ్ ముగుస్తుంది.

మలిదశలో 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌, 27న లక్నో సూపర్ జెయింట్స్, మే 1వ తేదీన రాజస్థాన్ రాయల్స్, 6న గుజరాత్ టైటాన్స్‌, 11న పంజాబ్ కింగ్స్, 15న ఢిల్లీ కేపిటల్స్‌ను ఎదుర్కొంటుంది. దీనితో ముంబై ఇండియన్స్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగుస్తాయి. ప్లే ఆఫ్స్ పరిస్థితి ఏమిటనేది ఆ జట్టు ఆటతీరుపై ఆధారపడి ఉంటుంది.

Take a Poll

కాగా- దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ ఐపీఎల్ సీజన్ ముందున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కేప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ మాల్దీవుల్లో సేదతీరుతున్నాడు. భార్య రితిక సజ్దే, కుమార్తె సమైరాతో కలిసి చక్కర్లు కొడుతున్నాడు. ఈ నెల 19 లేదా 20వ తేదీన తిరిగి రానున్నాడు రోహిత్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+