IPL 2026: వేలంలో కోట్లు కుమ్మరిస్తున్న ‘బ్యూటీ విత్ బ్రెయిన్’.. ఎవరీ మిస్టరీ గర్ల్?
IPL 2026: అబుదాబిలో జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం తన భారీ కొనుగోళ్లతోనే కాకుండా ఆ వేలం టేబుల్ వద్ద కనిపిస్తున్న 'లేడీ లక్'తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా కుమార్తె జాహ్నవీ మెహతా ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వేలంలో అందరి చూపు ఆమెపైనే!
ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక పర్స్ బ్యాలెన్స్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్.. టేబుల్ వద్ద చాలా చురుగ్గా కనిపిస్తోంది. అయితే జట్టు వ్యూహాలతో పాటు జాహ్నవీ మెహతా లుక్స్, ఆమె ప్రశాంతత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జయ మెహతా, జూహీ చావ్లా దంపతుల కుమార్తె అయిన జాహ్నవీ మెహతా, వరుసగా మూడోసారి ఐపీఎల్ వేలంలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు జాహ్నవీని ఆమె తల్లి జూహీ చావ్లాతో పోలుస్తున్నారు. ఆమెలోని సింప్లిసిటీ, హుందాతనం అందరినీ ఆకట్టుకుంటోంది. జాహ్నవీకి సినీ గ్లామర్ ప్రపంచం కంటే తన తండ్రిలాగే వ్యాపార రంగంపై, క్రికెట్ మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి ఎక్కువ. వేలం టేబుల్ వద్ద ఆమె చాలా లోతైన విశ్లేషణతో బిడ్డింగ్‌లో పాల్గొనడం కనిపిస్తోంది.

వేలంలో కేకేఆర్ సంచలనాలు
జాహ్నవీ మెహతా సమక్షంలో కేకేఆర్ నేడు భారీ కొనుగోళ్లు జరిపి ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఆ జట్టు దక్కించుకున్న ముగ్గురు ప్రధాన విదేశీ ఆటగాళ్లు వీరే:
కామెరాన్ గ్రీన్: రూ. 25.20 కోట్లు (ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు).
మతీషా పతిరానా: రూ. 18 కోట్లు (శ్రీలంక స్టార్ పేసర్).
ఫిన్ అలెన్: రూ. 2 కోట్లు (విధ్వంసకర ఓపెనర్).
ఈ ముగ్గురి కోసం కేకేఆర్ దాదాపు రూ. 45 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయినప్పటికీ, ఆ జట్టు వద్ద ఇంకా రూ. 19.10 కోట్ల పర్స్ బ్యాలెన్స్ మిగిలి ఉండటం విశేషం.
-
RCB సంచలన నిర్ణయం- ఇక ప్రతీ మ్యాచ్ కూ స్టేడియంలో ఆ 11 సీట్లు రిజర్వ్..! -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇంగ్లండ్ స్టార్ సడన్ గుడ్ బై-నిషేధం తప్పదా ? -
రేసు గుర్రాన్ని పక్కన పెట్టిన ఆర్సీబీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications