IPL 2026: బోణీ కొట్టిన చెన్నై.. మ్యాచ్ మలుపు తిరిగిందక్కడే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తమ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. వరుసగా మూడు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. శనివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై గెలుపొందింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ అజేయ శతకంతో.. బౌలింగ్ జెమీ ఓవర్టన్(4/18) నాలుగు వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

213 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో189 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ట్రిస్టన్ స్టబ్స్(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) ఒంటరి పోరాటం చేసినా.. పాతుమ్ నిస్సంక(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్(4/18) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, గుర్జప్‌నీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.

IPL 2026 Jamie Overton Game-Changing Spell and Sanju Samson s Century Lead CSK to Victory Over DC

అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. సంజూ శాంసన్(56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ఆయుష్ మాత్రే(36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే..

213 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్‌ను ఘనంగానే మొదలు పెట్టింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. జెమీ ఓవర్టన్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఇన్‌ఫామ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ(6), డేంజరస్ డేవిడ్ మిల్లర్(17), ఆకీబ్ నబీ(4)‌తో పాటు క్రీజులో సెట్ అయిన ట్రిస్టన్ స్టబ్స్‌ను ఓవర్టన్ తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి స్టబ్స్‌తో నెలకొల్పిన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఈ వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

ఓవైపు వరుసగా వికెట్లు కోల్పోయినా.. మరోవైపు స్టబ్స్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అతన్ని కూడా ఓవర్టనే ఔట్ చేసి చెన్నై విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. గత మూడు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు తేలిపోగా.. ఈ మ్యాచ్‌లో ఓవర్టన్ సత్తా చాటి గెలిపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+