IPL 2026 KKR vs SRH: తొలి గెలుపు కోసం ఇరు జట్లు ఆరాటం..విజయావకాశాలు వారికే..?

ఈడెన్ గార్డెన్స్‌లో మరో హై-వోల్టేజ్ పోరుకు వేదిక సిద్ధమైంది. ఐపీఎల్ 2026లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని కసితో ఉన్నాయి.

క్రికెట్ మక్కాగా పిలువబడే ఈడెన్ గార్డెన్స్ స్టేడియం నేడు కేకేఆర్ ఎస్ఆర్‌హెచ్ మధ్య జరగనున్న హోరాహోరీ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో అభిమానుల సందడి మొదలైంది. కోచ్ అభిషేక్ నాయర్ తన జట్టుకు ఈ 'హోమ్ క్రౌడ్' మద్దతే కొండంత అండ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ipl-2026-kkr-vs-srh-eden-gardens-set-for-thriller-as-kolkata-meets-hyderabad-in-a-high-voltage-match

కేకేఆర్ బలం.. బలహీనత

కోల్‌కతా జట్టులో అజింక్య రహానే కెప్టెన్సీలో బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నా, బౌలింగ్ విభాగంలో కొన్ని చిక్కులు ఉన్నాయి.ముఖ్యంగా ఆల్ రౌండర్ కామరూన్ గ్రీన్ బౌలింగ్‌కు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద మైనస్. లోయర్ బ్యాక్ ఇంజూరీ కారణంగా గ్రీన్ మరో 10 రోజుల పాటు బౌలింగ్ చేసే అవకాశం లేదు. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్‌లో విఫలమైనా, ఈడెన్ పిచ్‌పై అతనికి మంచి రికార్డు ఉంది. రింకూ సింగ్ ఫినిషర్ రోల్‌లో మెరవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కమిన్స్ లేని లోటు.. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ జట్టును నడిపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యం వల్ల ఓటమి పాలైన ఎస్ఆర్‌హెచ్, ఈసారి పేస్ విభాగంలో మార్పులు చేసే అవకాశం ఉంది.హెన్రిచ్ క్లాసెన్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు (ముఖ్యంగా చక్రవర్తిపై 211 స్ట్రైక్ రేట్ ఉంది),ఇది ఎస్ఆర్‌హెచ్‌కు కలిసొచ్చే అంశం.

ముఖాముఖి పోరు

గణాంకాలను చూస్తే కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.రెండు జట్ల మధ్య మొత్తం 30 మ్యాచ్‌లు జరుగగా అందులో కేకేఆర్ 20 మ్యాచుల్లో విజయం సాధించగా... సన్‌రైజర్స్ జట్టు 10 విజయాలతో సరిపెట్టుకుంది.ఇక ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ 8 సార్లు గెలిస్తే.. సన్ రైజర్స్ మూడింటిలో విజయం సాధించింది.

పిచ్ - వాతావరణం:
కోల్‌కతాలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నా, మ్యాచ్ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నా, స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి.

తొలి విజయం కోసం ఆరాటపడుతున్న రెండు జట్లు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రహానే అనుభవం వర్సెస్ ఇషాన్ కిషన్ దూకుడు.. ఈ రెండింటిలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. కేకేఆర్ తన కోటను కాపాడుకుంటుందా? లేక హైదరాబాద్ రైజర్స్ కోల్‌కతాను కోలుకోకుండా దెబ్బకొడతారా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+