IPL 2026: నెట్స్ లో సిక్సర్లు-గ్రౌండ్ లో తేలిపోతున్న 21 కోట్ల స్టార్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తక్కువ రేట్లకు ఫ్రాంచైజీలు కొనుక్కున్న ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించడం, భారీగా రేట్లు పెట్టి కొన్న ప్లేయర్లు తేలిపోవడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. ఈ ఐపీఎల్ (IPL 2026)లోనూ పరిస్ధితులు అందుకు భిన్నంగా ఏమీ లేవు. చెన్నైలో ప్రశాంత్ వీర్, కోల్ కతాలో కామెరూన్ గ్రీన్, లక్నోలో రిషబ్ పంత్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరితో పాటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోనే మరో బ్యాటర్ నికోలస్ పూరన్ కూడా చేరిపోయాడు.

IPL 2026: బుమ్రా-హార్ధిక్ మధ్య చిచ్చురేపిన పంజాబ్ మ్యాచ్..! ఏంటీ కెప్టెన్సీ..?
IPL 2026: బుమ్రా-హార్ధిక్ మధ్య చిచ్చురేపిన పంజాబ్ మ్యాచ్..! ఏంటీ కెప్టెన్సీ..?

లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ ..ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌ను ఎదుర్కొంటున్నాడు. 21 కోట్లకు లక్నో కొనుక్కున్న ఈ విండీస్ బ్యాట్స్ మెన్ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో అభిమానుల్లో పూరన్ పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు నికోలస్ పూరన్ నెట్స్ లో సిక్స్ లు కొడుతున్న వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ మరింత ట్రోలింగ్ చేస్తున్నారు.

IPL 2026 Rs 21 Crore Star Hits Nets Sixes Faces Brutal Trolling for 8 40 Match Average
Hardik Pandya: హార్ధిక్ కెప్టెన్సీకి గండం ? చేసింది చాలు.. ఇక రోహిత్ కు ఇచ్చేయ్..!
Hardik Pandya: హార్ధిక్ కెప్టెన్సీకి గండం ? చేసింది చాలు.. ఇక రోహిత్ కు ఇచ్చేయ్..!

పూరన్.. ఐదు మ్యాచ్‌లలో 8.40 సగటు, 76.36 స్ట్రైక్ రేట్‌తో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో పూరన్ అత్యధిక స్కోరు ఇప్పటివరకు 19 మాత్రమే. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో లక్నో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఫ్యాన్స్ లక్నో షేర్ చేసిన వీడియోపై ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. నెట్స్ లో సిక్స్ లు కొట్టడం కాదు గ్రౌండ్ లో కొట్టాలిగా అని కొందరు, నెట్స్ కోసమే 21 కోట్లు ఇచ్చి తీసుకున్నారా అంటూ మరికొందరు వాయించేస్తున్నారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. వరుస ఓటములకు తోడు ఈ ట్రోలింగ్ ససమస్యగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+