ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది!

క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఈ క్రికెట్ లీగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28, 2026న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారిక బ్రాడ్‌కాస్టర్ 'స్టార్ స్పోర్ట్స్' ఆదివారం ధ్రువీకరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు ముందు ఈ ప్రకటన రావడం క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపింది. మే 31, 2026 వరకు ఈ లీగ్ కొనసాగనుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అప్‌డేట్స్
గతేడాది (2025) టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), తమ సొంత గడ్డపైనే ఈ సీజన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటన తర్వాత బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడంపై నెలకొన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. కఠినమైన భద్రతా నిబంధనలతో ఈ స్టేడియం ఇప్పుడు క్రికెట్ మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ తమ 7 హోమ్ మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతుందని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. మిగిలిన 2 మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు.

IPL 2026 Schedule Announced Season Starts March 28 Finals and Playoffs in Bengaluru

ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు, క్వాలిఫైయర్-1 మ్యాచ్ కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే నిర్వహించనున్నట్లు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సెక్రటరీ సంతోష్ మీనన్ ధృవీకరించారు. ఈసారి ఐపీఎల్ మరింత భారీగా ఉండనుంది. గతంతో పోలిస్తే మ్యాచుల సంఖ్యను పెంచి, మొత్తం 84 మ్యాచులతో ఈ సీజన్ జరగనుంది.ఫైనల్ షెడ్యూల్, పూర్తి మ్యాచ్‌ల వివరాలను ఐపీఎల్ నిర్వహణ మండలి (GC) దశలవారీగా విడుదల చేయనుంది. సాధారణంగా ఎన్నికల సమయం కావడంతో, షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. తమ సొంత మైదానంలో మళ్లీ టైటిల్ వేటను మొదలుపెట్టడానికి సిద్ధమైంది. స్టేడియం భద్రత మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన తర్వాత, ఈ ఐకానిక్ మైదానంలో క్రికెట్ సందడి మళ్లీ మొదలవుతుండటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+