ఐపీఎల్ ఆక్షన్ వేళ.. రోహిత్ శర్మ రిలీజ్‌పై ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ కోసం దుబాయ్ వేదికగా మెగా వేలంపాట జోరుగా సాగుతోంది.10 ఫ్రాంఛైజీలు దీనికి హాజరయ్యాయి. మెరికల్లాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేసుకుంటోన్నాయి. కొత్త ఆటగాళ్లతో వచ్చే ఏడాది జరిగే సీజన్ మరింత రచ్చరచ్చగా కనిపించడం ఖాయం.

రోహిత్ శర్మను కేప్టెన్సీ బాధ్యతల నుంచి ముంబై ఇండియన్స్ తప్పించడం వల్ల అందరి దృష్టీ ఆ జట్టుపైనే నిలిచింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుందనే విషయం హాట్ డిబేట్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌ తరహాలోనే తమ జట్టుకూ విజయాలను అందిస్తాడని నమ్ముతోంది ముంబై.

IPL auction 2024: Rohit Sharma is not going anywhere, says Mumbai Indians

ఆ నమ్మకంతోనే- అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమైనప్పటికీ.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. హార్దిక్ పాండ్యా కేప్టెన్సీలో తాను ఎలాంటి భేషజాలు లేకుండా ఆడతానంటూ రోహిత్ శర్మ ఇదివరకే స్పష్టం చేశాడనీ ముంబై ఇండియన్స్ తెలిపింది. రోహిత్ అంగీకారంతోనే తాము సారధ్య బాధ్యతలను మార్చామనీ తేల్చి చెబుతోంది.

ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది ముంబై ఇండియన్స్. దుబాయ్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముంబై ఇండియన్స్ డైరెక్టర్ మాట్లాడారు. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు ఎందుకు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించాల్సి వచ్చిందంటూ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.

రోహిత్ శర్మ తమ జట్టు నుంచి ఎక్కడికీ వెళ్లట్లేదని, ఎలాంటి అసంతృప్తి కూడా అతనిలో లేదని స్పష్టం చేశారు. ఎప్పట్లాగే జట్టు విజయాల్లో రోహిత్ శర్మ పాత్ర ఉంటుందని తాము నమ్ముతున్నామని అన్నారు. రోహిత్ ఒక్కడే కాదు.. ఏ ప్లేయర్ కూడా తమ జట్టు నుంచి బయటికి వెళ్లబోరని వివరించారు. రోహిత్‌ను బయటికి పంపించాలనుకుంటే ప్లేయర్ల రిటెన్షన్ సందర్భంలోనే అతన్నిరిలీజ్ చేేసే వాళ్లమని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+