IPL auction 2024: ఆ విండీస్ వీరుడిపై కోట్ల రూపాయలు గుమ్మరించారు.. !!
Rovman Powell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ కోసం మెగా ఆక్షన్ (IPL 2024 auction) మొదలైంది. దుబాయ్ వేదిక ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ఆరంభమైంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో సినిమా దీన్ని స్ట్రీమింగ్ చేస్తోన్నాయి. ఫ్రాంఛైజీలు ఎలాంటి ప్లేయర్లను తీసుకుంటాయనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
మెగా వేలం పాట కోసం మొత్తంగా 333 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. క్రికెట్ ఆడే అన్ని జట్లకు చెందిన స్టార్ ప్లేయర్లందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో 214 మంది భారత్, 119 మంది విదేశీ ప్లేయర్లు. 116 మంది క్యాప్డ్, 215 మంది అన్ క్యాప్డ్ ఉన్నారు.

హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రౌమన్ పావెల్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్, వనిందు హసరంగ, రచిన్ రవీంద్ర, కేఎస్ భరత్, కుషాల్ మెండిస్, ట్రిస్టన్ స్టబ్స్, లోకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, దిల్షాన్ మదుశంక.. వంటి స్టార్ ప్లేయర్లందరూ తమ అదృష్ణాన్ని పరీక్షించుకోనున్నారు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రౌమన్ పావెల్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఐపీఎల్ ఆక్షన్‌లో అతని కోసం రెండు జట్లు పోటీ పడ్డాయి. కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తీవ్రంగా పోటీ నడిచింది. పావెల కోసం ట్రిప్ ట్రిప్‌కూ రేటును పెంచుకుంటూ పోయాయి ఈ రెండు ఫ్రాంఛైజీలు.
Rovman Powell sold to RR for 7.4cr#RovmanPowell #IPLAuction #IPL2024Auction #IPLAuction2024 #IPLAuctiononJioCinema #IPL2024 #TATAIPL #Oneindiatelugu pic.twitter.com/7mDy23LbeH
— oneindiatelugu (@oneindiatelugu) December 19, 2023
పావెల్ బేస్ ప్రైజ్ కోటి రూపాయలు మాత్రమే. అతని కోసం పోటీ పడటం వల్ల ప్రైజ్ 7 కోట్ల రూపాయలను దాటేసింది. చివరికి 7 కోట్ల 40 లక్షల రూపాయలకు అతను అమ్ముడుపోయాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని జట్టులోకి తీసుకుంది. దీనికోసం కోట్ల రూపాయలను గుమ్మరించింది.
ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఢిల్లీ కేపిటల్స్ ఫ్యామిలీలో చేరాడు. నాలుగు కోట్ల రూపాయలకు అతన్ని జట్టులోకి తీసుకుంది ఢిల్లీ కేపిటల్స్. అతని బేస్ ప్రైజ్ రెండు కోట్ల రూపాయలు. ఈ మొత్తం వద్ద ఆక్షన్ మొదలు కాగా అతని కోసం ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరికి 4 కోట్ల రూపాయలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications