IPL auction 2024: కావ్యా పాప బోణీ బాగుంది: సన్‌రైజర్స్‌లో వరల్డ్ కప్ సెంచరీ హీరో..!!
Travis Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ కోసం మెగా ఆక్షన్ (IPL 2024 auction) మొదలైంది. దుబాయ్ వేదిక ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ఆరంభమైంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో సినిమా దీన్ని స్ట్రీమింగ్ చేస్తోన్నాయి. ఫ్రాంఛైజీలు ఎలాంటి ప్లేయర్లను తీసుకుంటాయనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
మెగా వేలం పాట కోసం మొత్తంగా 333 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. క్రికెట్ ఆడే అన్ని జట్లకు చెందిన స్టార్ ప్లేయర్లందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో 214 మంది భారత్, 119 మంది విదేశీ ప్లేయర్లు. 116 మంది క్యాప్డ్, 215 మంది అన్ క్యాప్డ్ ఉన్నారు.

హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రౌమన్ పావెల్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్, వనిందు హసరంగ, రచిన్ రవీంద్ర, కేఎస్ భరత్, కుషాల్ మెండిస్, ట్రిస్టన్ స్టబ్స్, లోకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, దిల్షాన్ మదుశంక.. వంటి స్టార్ ప్లేయర్లందరూ తమ అదృష్ణాన్ని పరీక్షించుకోనున్నారు.
TRAVIS HEAD sold to SRH for 6.8cr#TravidHead #IPLAuction #IPL2024Auction #IPLAuction2024 #IPLAuctiononJioCinema #IPL2024 #TATAIPL #Oneindiatelugu pic.twitter.com/OjdfeqzGC4
— oneindiatelugu (@oneindiatelugu) December 19, 2023
ఈ వేలం పాటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను జట్టులోకి తీసుకుంది. దీనికోసం 6 కోట్ల 80 లక్షల రూపాయలను ఖర్చు పెట్టింది. ట్రవిస్ బేస్ ప్రైజ్ రెండు కోట్ల రూపాయలు. అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య వాడివేడిగా పోటీ కొనసాగింది. అతన్ని తీసుకోడానికి ఈ రెండు జట్లూ పోటీ పడ్డాయి.
చివరికి- సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని దక్కించుకుంది. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో ట్రావిస్ హెడ్ ఎలా ఆడాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. సెంచరీతో కదం తొక్కాడు. 50 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లో పాతుకుపోయిన హెడ్.. తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.












Click it and Unblock the Notifications