IPL Auction 2026: వెంకటేష్ అయ్యర్‌కు బిగ్ షాక్: ఏడాదిలోనే సీన్ రివర్స్!

IPL Auction 2026: ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కు భారీ షాక్ తగిలింది. గత సీజన్‌లో రూ.23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) తరఫున ఆడిన అయ్యర్‌ను ఈసారి కేవలం రూ.7 కోట్లకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొనుగోలు చేసింది. దీంతో వెంకటేష్ అయ్యర్‌కు మొత్తం రూ.16.75 కోట్ల నష్టం వాటిల్లింది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో, డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ అతడిని వేలానికి ముందే రిలీజ్ చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అయ్యర్‌పై చివరకు RCB పట్టు సాధించింది.

వెంకటేశ్ అయ్యర్ కోసం ఎలా సాగింది బిడ్డింగ్?
వెంకటేశ్ అయ్యర్‌పై మొదట లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బిడ్డింగ్ ప్రారంభించింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ (GT) కూడా రంగంలోకి దిగడంతో ధర రూ.2.60 కోట్లకు చేరింది. తర్వాత ఆర్సీబీ ఎంట్రీ ఇవ్వడంతో బిడ్డింగ్ వేగం పెరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ రూ.3.20 కోట్ల వద్ద వెనక్కి తగ్గింది. అక్కడి నుంచి అయ్యర్ పాత జట్టు కేకేఆర్ కూడా పోటీలోకి రావడంతో ఆర్సీబీ-కేకేఆర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రూ.6.80 కోట్ల వరకూ ఇద్దరి మధ్య బిడ్డింగ్ సాగగా.. చివరికి రూ.7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెంకటేశ్ అయ్యర్‌ను తన జట్టులోకి తీసుకుంది.

IPL Auction 2026 Big Shock for Venkatesh Iyer as Price Drops from 23 75 Cr to 7 Cr

ధర తగ్గడానికి కారణం ఏంటి?
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన వెంకటేశ్ అయ్యర్, గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. భారీ ధర పెట్టి కొనుగోలు చేసినప్పటికీ ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది. ఈ ప్రభావం నేటి వేలంపై స్పష్టంగా కనిపించింది.

వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ ప్రస్థానం
వెంకటేశ్ అయ్యర్ 2021లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేశాడు. మొదటిసారి కేకేఆర్ కాకుండా మరో జట్టు (ఆర్సీబీ) తరఫున ఆడబోతున్నాడు. ఐపీఎల్‌లో 62 మ్యాచ్‌ల్లో 1468 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్‌లో వెంకటేష్ అయ్యర్ చేరిక ఆ జట్టుకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఆల్‌రౌండర్ కోటాలో వచ్చినప్పటికీ, అతన్ని ఫినిషర్‌గా లేదా ఓపెనర్‌గా ఉపయోగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+