MS Dhoni: సీఎస్కేకు ధోనీ బిగ్ షాక్..! గుజరాత్ మ్యాచ్ ఎందుకు ఆడలేదంటే ?

ఒకప్పుడు తన ఆటతీరుతోనే కాదు, హావభావాలతో సైతం ప్రేక్షకుల్ని మైదానాలకు రప్పించిన మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కనిపించడమే మానేశాడు. గాయంతో టోర్నీలో ఆరంభ మ్యాచ్ లకు దూరమైన ధోనీ.. మ్యాచ్ లు గడుస్తున్నా ఇంకా ఎప్పుడు బరిలోకి దిగుతాడో తెలియడం లేదు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ధోనీ బరిలోకి దిగుతాడని వార్తలు వచ్చినా అలా జరగలేదు. ఇప్పటికే ప్రతీ మ్యాచ్ కూ ధోనీ ఆడతాడా అనే ప్రశ్న తెరపైకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ధోనీకి మరోసారి గాయమైందన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి.

నిన్నటి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ధోనీ ఆడకపోవడంపై ఎట్టకేలకు సీఎస్కే స్పందించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ ఎందుకు అందుబాటులో లేడో చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు. ధోనీ కోలుకోవడంలో కోలుకోవడంలో మరో ఎదురుదెబ్బ తగిలిందని ఆయన ధృవీకరించారు. ధోనీ పిక్క కండరంలో కొత్తగా గాయం తిరగబెట్టడంతో, రాబోయే మ్యాచ్‌లకు అతని లభ్యతపై మళ్లీ సందేహాలు తలెత్తాయి. పిక్క గాయం కారణంగా జట్టుకు దూరమైన ధోనీ, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆడలేదు. ఈ సీజన్ ఆరంభ రెండు వారాల పాటు మాజీ కెప్టెన్ జట్టుకు దూరంగా ఉంటాడని సీఎస్‌కే ఇప్పటికే సోషల్ మీడియాలో ధృవీకరించింది.

Is MS Dhoni Hurt CSK s Head Coach Breaks Silence on His GT Absence

చేపాక్‌లో ధోనీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాలని అభిమానులు ఆశించడంతో, ఆదివారం నాటి మ్యాచ్‌పై అంచనాలు పెరిగాయి. అయితే, అతను మరోసారి తుది జట్టు నుండి తప్పుకోవడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఫ్లెమింగ్.. ధోనీ కోలుకోవడాన్ని వేగవంతం చేయడానికి సీఎస్‌కే ప్రయత్నించిందని, కానీ వార్మప్ గేమ్‌లో గాయం మళ్లీ తిరగబెట్టిందని ఫ్లెమింగ్ తెలిపారు. ధోనీ పిక్క గాయం ఇంకా ఆందోళన కలిగిస్తోందని, ముఖ్యంగా దానికి ఏ మాత్రం తీవ్రమైన బెణుకు వచ్చినా అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని ఫ్లెమింగ్ వివరించారు. ఫలితంగా, ఒక వార్మప్ మ్యాచ్‌లో గాయం మరింత తీవ్రమయ్యే ప్రమాదం కంటే, సీఎస్‌కే జాగ్రత్తతో కూడిన విధానాన్ని ఎంచుకుంది.

Is MS Dhoni Hurt CSK s Head Coach Breaks Silence on His GT Absence

ధోనీ పిక్క గాయం చాలా తీవ్రమైనదని, ఒకవేళ అతను వేగంగా ఆడి మళ్ళీ గాయం పెంచుకుంటే, అతను జట్టుకు దూరమవుతాడని ఫ్లెమింగ్ తెలిపాడు. అందుకే తాము ముందుగానే జాగ్రత్త పడ్డామన్నాడు. వార్మప్ గేమ్‌లో అతనికి మళ్ళీ గాయం అయిందని, తన అవగాహన ప్రకారం, అప్పటి నుండి అతను ఆ కండరానికి కదలిక తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడని తెలిపాడు. కానీ ఒక ఎదురుదెబ్బ తగిలిందని, అందుకే అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టిందన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+