విషాదం దిగమింగి బరిలో ఇషాన్, ఫైనల్ వేళ సోదరి మరణంతో - మద్దతుగా నిలిచిన హార్దిక్..!!
టీ20 ప్రపంచ కప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ప్రతీ ఆటగాడు ప్రాణం పెట్టి దేశం కోసం ఆడారు. ప్రతీ విభాగంలో ఏకపక్షంగా కివీస్ పైన విజయం సాధించారు. ఈ సంతోషం వెనుక విషాద ఘటనలు ఉన్నాయి. ప్రపంచ కప్ లో భారత్ విజయాల వెనుక ఇషాన్ కిషన్ వీరోచిత బ్యాటింగ్ ఒక కారణం. అభిషేక్ విఫలమైన సమయంలో సంజూకు మద్దతుగా నిలిచి మంచి స్కోరు సాధనంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక.. ఫైనల్ లోనూ ఇషాన్ ఆట అద్బుతం. అయితే.. ఫైనల్ కు ముందు ఇషాన్ చెల్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయినా.. దేశం కోసం బరిలో నిలిచాడు. ఈ విజయాన్ని తన సోదరికి అంకితం చేసాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీం ఇండియా 96 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. భారత్ భారీ స్కోరు సాధించటంలో ఇషాన్ కిషన్ పాత్ర కీలకం. అభిషేక్ అవుట్ అయిన తరువాత సంజూతో కలిసి స్కోరు బోర్డును బౌండరీలు.. సిక్సర్లతో పరిగెత్తించాడు.

అయితే, అప్పటికే ఇషాన్ పుట్టెడు విషాదం లో ఉన్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్ తరువాత బయట పెట్టాడు. తన జీవితంలో అత్యంత కష్టతర మైన క్షణాలలో ఒకదాన్ని పంచుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందే నా సోదరి చనిపోయింది. నేను ప్రపంచ కప్ గెలవాలని ఆమె కోరుకుంది. కానీ ఇప్పుడు ఆమె లేదు. ఈ ప్రపంచ కప్ ను ఆమెకు అంకితం చేస్తున్నానని ఇషాన్ కిషన్ ఆనంద క్షణాల మధ్య తన బాధను పంచుకున్నాడు.
ఫైనల్ ముందు రోజున మార్చి 7న పశ్చిమ బెంగాల్‌లోని 27వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇషాన్ కిషన్ సోదరి వైష్ణవి సింగ్, ఆమె భర్త మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఆ దంపతులకు ఆరు నెలల మూడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు చిన్న పిల్లలు అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఇషాన్ విషాదంలో మునిగిపోయాడు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా ఇచ్చిన ధైర్యం కారణంగా అతను మైదానంలోకి దిగాడు.

జట్టు మంచి కోసం ఇషాన్ కిషన్ ఫైనల్ మ్యాచ్ ఆడాలని అప్పుడే డిసైడ్ అయ్యాడు. ఫైనల్ లో ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫీల్డ్‌లో మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టి, టీమ్ ఇండియా ఛాంపియన్‌గా నిలవటంలో కీలకంగా మారాడు. "ఈ విజయాన్ని నా సోదరికి అంకితం చేస్తున్నాను. నా ఈ చారిత్రాత్మక క్షణాలను నేను చూడాలని ఆమె కోరుకుంది. కాబట్టి ఇషాన్ కిషన్ భావోద్వేగానికి గురై, 'ఈ ట్రోఫీని నా సోదరికి అంకితం చేస్తున్నానంటూ..ఇషాన్ ఉద్వేగానికి లోనయ్యాడు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications