Jasprit Bumrah:బుమ్రాకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్..!!

Jasprit Bumrah:బూం..బూం..బుమ్రా. ఈ పేరు వింటేనే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. బుమ్రా బౌలింగ్‌కు దిగాడంటే అవతల బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఆ బంతిని ఎలా ఆడాలో మెదడులో సవాలక్ష ఆలోచనలు గిర్రున తిరుగుతుంటాయి. పొరపాటు జరిగిందా... పెవీలియన్‌కు వెళ్లి కూర్చోవడమే. అలాంటి భయం పుట్టించాడు బుమ్రా. కానీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ చూస్తుంటే బుమ్రా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న 15ఏళ్ల బుడ్డోడు సూర్యవంశీ బంతిని ఏకంగా సిక్స్‌గా బాదాడు. దీంతో మిగతా బ్యాట్స్‌మెన్లలో కూడా బుమ్రా అనే పేరుకున్న భయాన్ని తొలగించాడు. ఇంతకీ బుమ్రాకు ఏమైంది..?

ఇంకా వికెట్ల ఖాతా తెరవని బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా... ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ తీయలేదు.తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు రక్తకన్నీరు అంటే ఏంటో చూపించే బుమ్రా...ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో.. ఇప్పుడు అదే రక్తకన్నీరు అంటే ఎలా ఉంటుందో రుచి చూస్తున్నాడు. వికెట్ తీయడం సంగతి అటుంచితే పరుగులు కూడా భారీగానే ఇస్తున్నాడు.గతేడాది అంటే 2025 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన చివరి మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయని బుమ్రా... ఈ 2026 ఐపీఎల్‌లో 4 మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇంకా వికెట్ల ఖాతా తెరవకపోవడం అభిమానులను కలవరపెడుతోంది.ఎవరికైనా సరే గడ్డుకాలం నడుస్తుంది. అలానే ప్రస్తుం బుమ్రా విషయంలో కూడా అదే బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ సమయంలోనే ఆ పేసర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు పలువురి సపోర్ట్ లభిస్తోంది.

jasprit-bumrah-lean-phase-continues-in-ipl-2026-no-wickets-yet-fans-shocked-what-s-going-wrong

బుమ్రాకు అండగా...

బుమ్రా బ్యాడ్‌ ఫేజ్‌లో అండగా నిలిచాడు తన మాజీ సహచరుడు టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్. వికెట్లు తీయడం కన్నా బుమ్రా వేసే యార్కర్లు తద్వారా పరుగులను నిలువరించడమనేది చాలా ముఖ్యం అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. బుమ్రా వికెట్లు తీయకపోవచ్చు కానీ పరుగుల వరదను నియంత్రిస్తున్నాడని అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే లాంటి గ్రౌండ్‌లో పరుగుల వరద భారీ స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ బుమ్రా తన టైట్ యార్కర్లతో రన్స్ నియంత్రిస్తున్నాడనే విషయాన్ని అశ్విన్ గుర్తు చేశాడు.

బుమ్రా గణాంకాలు ఇలా

ఇక బుమ్రా గతేడాది ఐపీఎల్ చివరి మ్యాచ్‌తో పాటు ఈ ఏడాది టోర్నమెంట్‌ గణాంకాల విషయానికొస్తే... ఈ ఏడాది 122 బంతులను సంధించగా.. ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.2025 ఐపీఎల్‌లో పంజాబ్‌తో జరిగిన ముంబై చివరి మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి వికెట్లు ఏమీ తీయకుండా 40 పరుగులు ఇచ్చాడు.2026 ఐపీఎల్ గణాంకాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.

0/35 (4) vs కేకేఆర్, వాంఖడే

0/21 (4) vs ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ

0/32 (3) vs రాజస్థాన్ రాయల్స్, గౌహతి

0/35 (4) vs ఆర్సీబీ, వాంఖడే

ఆర్సీబీతో మ్యాచ్‌లో....

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 4 ఓవర్లు వేయగా 35 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే ముంబై ఇండియన్స్ బౌలర్లలో మంచి ఎకానమీ రేట్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కానీ బుమ్రా బౌలింగ్‌లో మాత్రం తడబడ్డారు. అయితే కేవలం బుమ్రా వికెట్లు తీయడం లేదు అనే దానిపైనే దృష్టి సారిస్తే ముంబై ఇండియన్స్ జట్టుకు ఇబ్బందులు తప్పవనే విషయాన్ని అశ్విన్ రవిచంద్రన్ గుర్తు చేస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు టైట్ యార్కర్లు వేయడం, పరుగులను నియంత్రించడం అనేది ఒక్క బుమ్రాకే సాధ్యమని అశ్విన్ చెప్పుకొచ్చాడు.అదే ముఖ్యం కూడా అని ముగించాడు.

ఏది ఏమైనప్పటికీ సగటు ముంబై ఇండియన్స్ అభిమానుల్లో మాత్రం బుమ్రా ఎందుకు వికెట్ తీయలేకపోతున్నాడనే చర్చ తీవ్రంగా జరుగుతోంది అదే సమయంలో ముంబై వరుస ఓటములను వారిని కలవరపెడుతోంది. బుమ్రా కనుక లైన్ అందుకుని పవర్ ప్లేలో రెచ్చిపోయి రెండు వికెట్లు కనుక తీస్తే.. ముంబైను ఎవడ్రా ఆపేది అనేలా ఫ్యాన్స్ చెప్పుకుంటారు.ఇక రానున్న మ్యాచ్‌లో బుమ్రా బుల్లెట్‌లా దూసుకెళ్లి టీమ్‌ను ట్రాక్‌లో పెడతాడని ఆశిద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+