Jemimah Rodrigues: ఓడిన చోటే గెలిచిన జెమీమా..! ముంబై క్లబ్ సభ్యత్వం రద్దు వివాదమేంటి ?
జెమీమా రోడ్రిగ్స్.. నిన్న నవీ ముంబైలో జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై సెంచరీతో అజేయంగా నిలిచి భారత్ ను ఫైనల్లోకి తీసుకెళ్లిన ఈ యువ కెరటం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. భారత్ లో క్రికెట్ కేంద్రంగా ఉన్న ముంబై నుంచి క్రికెటర్ గా ఎదిగిన జెమీమా నిన్న సొంతగడ్డపై సాధించిన సెంచరీ ఆమెను మేటి క్రికెట్ క్రీడాకారిణుల జాబితాలో నిలబెట్టింది. అయితే అదే సమయంలో గతేడాది అదే ముంబైలో ఆమె ఎదుర్కొన్న ఓ అవమానాన్ని కూడా తెరపైకి తెచ్చింది.
నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో జెమీమా అజేయంగా 127 పరుగులు చేసి భారత్‌ను చారిత్రాత్మక ఛేజ్ లో నిలబెట్టడమే కాకుండా టోర్నీలో ఫైనల్ బెర్తును ఖరారు చేయించింది. గతేడాది ఇదే సమయంలో ఆమె అదే ముంబైలో ఎదుర్కొన్న ఓ అవమానం తర్వాత నెలల తరబడి చేసిన పోరాటం, విమర్శలు, క్లబ్ వివాదం తర్వాత సాధించిన ఈ విజయం జెమీమాను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. అందుకే నిన్న మ్యాచ్ లో భారత్ గెలవగానే జెమీమా ఉద్వేగాన్ని అస్సలు ఆపుకోలేకపోయింది.

గతేడాది అక్టోబర్ నెలలో అంటే కచ్చితంగా ఏడాది క్రితం జెమిమా రోడ్రిగ్స్ గౌరవ సభ్యత్వాన్ని ముంబైలోని ఖర్ జింఖానా క్లబ్ రద్దు చేసింది. జెమీమా తండ్రి రోడ్రిగ్స్ ఆమెకు క్లబ్ ను ప్రైవేట్ కార్యక్రమాలకు నిర్ణీత రుసుము చెల్లించి వాడుకునేందుకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అక్కడ మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది ఇక్కడ ఆరోపణ. అయితే ఈ ఆరోపణల్ని జెమీమా, తండ్రి రోడ్రిగ్స్ ఖండించినా ఫలితం లేదు.

జెమీమా రోడ్రిగ్స్ ఇలా ముంబై ఖర్ జింఖానా క్లబ్ సభ్యత్వం రద్దుతో పాటు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇందులో ఆమె మతం పేరుతో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంది. దీన్నుంచి బయటపడేందుకు జెమీమా చాలా కష్టపడింది. జట్టులో స్ధానం కూడా కోల్పోయింది. చివరికి తన మేటి ప్రదర్శనతో తిరిగి జట్టులోకి రాగలిగింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కీలకమైన ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టింది. చివరికి సెంచరీ కొట్టినా లైట్ తీసుకుంది. మ్యాచ్ గెలిపించి తానేంటో నిరూపించుకుంది. దీని వెనుక ఏడాదిగా ఆమె పడిన బాధ, పట్టుదల, ఉద్వేగం ఇలా చాలానే ఉన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications