కేన్ మామ నుంచి అస్సలు ఊహించని నిర్ణయం..
Kane Williamson Retirement: న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. టీ20 ఇంటర్నేషనల్స్ కు గుడ్ బై చెప్పాడు. ఈ ఫార్మట్ కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్ కప్ కు కొన్ని నెలల ముందు అతను ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరల్డ్ కప్ ఆరంభానికి ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల బోర్డ్ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడానికి స్పష్టత ఇస్తుందని అభిప్రాయపడ్డాడు.
తన టీ20 ఇంటర్నేషనల్స్ కెరీర్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆదరించిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ ఫార్మట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించానని, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు కూర్పుపై సెలెక్టర్లకు ఓ స్పష్టత ఏర్పడుతుందని చెప్పాడు. మున్ముందు జట్టు ఆడబోయే సిరీస్‌లకు సన్నద్ధం కావాల్సి ఉందని, మెకరికల్లాంటి యువ క్రికెటర్లకు అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించాడు.

టీ20ల్లో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, వారిని ప్రపంచకప్‌కు సిద్ధం చేయడానికి ఇది సరైన సమయమని కేన్ చెప్పాడు. మిఛెల్ శాంట్నర్ ను అద్భుతమైన కేప్టెన్ గా అభివర్ణించాడు. కేన్ విలియమ్సన్ టెస్ట్ సిరీస్‌పై దృష్టి సారించనున్నాడని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. ఒత్తిడిని అధిగమించే గొప్ప క్రికెటర్, కేప్టెన్ అని కితాబిచ్చాడు. ఓ అద్భుతమైన టీమ్ మ్యాన్ ప్రశంసించాడు.
మొత్తం 93 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన కేన్ విలియమ్సన్ 2,575 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 95. 2011 నుండి 2024 మధ్య కాలంలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. 75 మ్యాచ్‌లకు కేప్టెన్‌గా వ్యవహరించాడు. 33.44 యావరేజ్ ను నమోదు చేశాడు.
టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ కేన్ విలియమ్సన్. 2021లో జట్టును ప్రపంచకప్ ఫైనల్‌కు నడిపించిన ఘనత అతనికి ఉంది. 2016 ప్రపంచకప్‌లో జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోనూ తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యాన్ని వహించాడు.












Click it and Unblock the Notifications