IPL Auction 2026:ఐపీఎల్ వేలం ప్రారంభం-25.2 కోట్లకు అమ్ముడుపోయిన కామెరూన్ గ్రీన్ ..!

ఐపీఎల్ 2026 సీజన్ కోసం నిర్వహిస్తున్న మినీ వేలం ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం అబుదాబీలో ప్రారంభమైంది. వరుసగా నాలుగోసారి మల్లికా సాగర్ ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో తొలుత ఆస్టేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, భారత బ్యాటర్ పృధ్వీషా వారికి పెట్టిన కనీస ధరలకు కూడా అమ్ముడుపోలేదు. అనంతరం డేవిడ్ మిల్లర్ ను 2 కనీస ధర అయిన 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం అసలు పోరు మొదలైంది.

ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కు కనీస ధర 2 కోట్లతో వేలం ప్రారంభం కాగా.. తొలుత కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అతన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి. కామెరూన్ గ్రీన్ ను కొనుగోలు చేసేందుకు 13.60 కోట్ల వరకూ వెళ్లిన రాజస్థాన్ రాయల్స్ జట్టు అనంతరం చేతులెత్తేసింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కామెరూన్ గ్రీన్ కోసం పోటీ మొదలైంది. దీంతో ఇరువురూ పోటాపోటీగా రేట్లు పెంచుకుంటూ పోయారు. చివరికి కోల్ కతా నైట్ రైడర్స్ ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు వెచ్చించి వేలంలో దక్కించుకుంది.

KKR Secures Cameron Green Kolkata Knight Riders Land Australian All-rounder in IPL 2026 Auction

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ కనీస ధర 2 కోట్లకు అమ్ముడుపోలేదు. అలాగే దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ ను సైతం కనీస ధర కోటికి కూడా ఏ జట్టూ తీసుకోలేదు. శ్రీలంక స్పిన్నర్ హసరంగను లక్నో సూపర్ జెయింట్స్ కనీస ధర 2 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే భారత బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ ను కనీస ధర 2 కోట్లకు పెడితే రాయల్ ఛాలెంజర్స్ 7 కోట్లకు కొనుగోలు చేసింది. మరో భారత ఆటగాడు దీపక్ హుడాకు కనీస ధర 75 లక్షలు పెట్టినా అమ్ముడుపోలేదు. అలాగే వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను కూడా 75 లక్షలకు కూడా ఏ జట్టూ తీసుకోలేదు.

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ను ముంబై ఇండియన్స్ కోటి రూపాయలకు కొనుక్కుంది. ఆప్ఘన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ మాత్రం అమ్మడుపోలేదు. ఇంగ్లండ్ కీపర్ జానీ బెయిర్ స్టోను సైతం కోటి రూపాయలకు ఎవరూ తీసుకోలేదు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ డకెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కివీస్ వికెట్ కీపర్ ఫిన్ అలెన్ ను కోల్ కతా 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+