Ind Vs Eng: హార్దిక్ స్థానంలో ఎవరంటే, ఇంగ్లాండ్ తో అదే డేంజర్ - కేఎల్ రాహుల్..!!
ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న రోహిత్ టీం ను సౌతాఫ్రికా అధిగమించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. టీం ఇండియా ఈ రోజు ఇంగ్లాండ్ తో తలపడుతోంది. తొలి స్థానంలో వచ్చేందుకు టీమిండియా..నిష్క్రమణ దశ నుంచి తిరిగి నిలబడాలంటే గెలవని పరిస్థితిలో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో పోటీ పడుతున్నాయి. అయితే, హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు దూరంగా ఉంటున్నాడు. హార్డిక్ స్థానంలో ఎవరికి అవకాశం దక్కనుందో రాహుల్ క్లారిటీ ఇచ్చాడు.
బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడిన హార్డిక్ పాండ్యా ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు దూరంగా ఉండనున్నాడు. ఈ మ్యాచ్ కు ఉన్న ప్రాధాన్యతను టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వివరించాడు. తమదైన రోజున ఇంగ్లాండ్ టీం పూర్తి ప్రమాదకారిగా మారుతుందని చెప్పుకొచ్చాడు. దీంతో తమ టీం పూర్తి స్థాయిలో ఈ మ్యాచ్ కోసం సిద్దమైనట్లు పేర్కొన్నాడు. హార్డిక్ లేకపోవటం నష్టమే అయినా..ఆ స్థానం సూర్య భర్తీ చేస్తాడని రాహుల్ వెల్లడించాడు. హార్డిక్ ను జట్టు మిస్ అవుతుందని చెప్పాడు. అయితే, సూర్య ప్రతిభకు అందిరకీ తెలుసని వివరించాడు. సూర్య మరోసారి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని.. పాండ్యా తిరిగి వచ్చే వరకు సూర్య పైన నమ్మకం ఉంచాల్సిందేనని రాహుల్ స్పష్టం చేసారు.

వరుస ఓటమలు చవి చూస్తున్నా ఇంగ్లాండ్ ను తక్కువ అంచనా వేయకూడదని చెప్పాడు. వాళ్లు డేంజరస్ టీంగా విశ్లేషించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని..ఈ మ్యాచ్ ను తేలికగా తీసుకొనే పరిస్థితి లేదని వివరించాడు. లక్నో పిచ్ పైన తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే బాగుటుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు దూకుడైన ఆటతో విజయాలు సాధిస్తున్నామని చెప్పుకొచ్చాడు. దీనిని తదుపరి మ్యాచ్ ల్లోనూ కొనసాగించేందుకు పూర్తి స్థాయిలో సిద్దం అవుతున్నామని వెల్లడించాడు. ఇప్పటి వరకు ప్రపంచ కప్ లో ఒక్క ఓటమి కూడా ఎదుర్కోని జట్టుగా భారత్ నిలిచింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఇదే ట్రాక్ రికార్డు కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, పిచ్ కండీషన్ల ఆధారంగా మరో స్పిన్నర్ కు అవకాశం ఇస్తారా లేక, ఇదే టీంను కొనసాగిస్తారా అనేది చూడాలి. టాస్ కీలకం కానుంది.












Click it and Unblock the Notifications