తిలక్ వర్మ షాకింగ్ డెసిషన్- రిటైర్డ్ అవుట్ వెనుక ఎవరి ప్రమేయం?
Tilak Varma: ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. మొత్తం నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 8వ తేదీన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టనుంది.
ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడింది లక్నో సూపర్ జెయింట్స్. రెండో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఆ తరువాత పంజాబ్ కింగ్స్ చేతిలో చతికిలపడింది. ఇప్పుడు తన సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన లోకల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్ టాప్ స్కోరర్. 60 పరుగులతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్- 53, మిడిలార్డర్‌లో ఆయుష్ బదోనీ- 30, డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేయడంతో స్కోర్ 200 దాటింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ స్కోర్‌ను అందుకోలేకపోయింది. అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ గైర్హాజర్ అయిన గేమ్ ఇది. ఓపెనర్లు విల్ జాక్స్, రియాన్ రికెల్టన్ విఫలం అయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నమన్ ధీర్- 46, సూర్యకుమార్ యాదవ్- 67 మాత్రమే దుమ్ము దులిపారు.
డెత్ ఓవర్లల్లో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినా అప్పటికే మ్యాచ్ చేజారింది. 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో 28 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా. నాటౌట్‌గా నిలిచాడు. అతని మెరుపు ఇన్నింగ్.. ఓటమి అంతర్యాన్ని తగ్గించగలిగిందే గానీ.. ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయింది.

కాగా- ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 18.5 ఓవర్లకు జట్టు స్కోర్ 180 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రీజ్‌ను వీడాడీ హైదరాబాదీ. అతను చేసింది.. 23 బంతుల్లో 25 పరుగులు. ఇందులో రెండే ఫోర్లు ఉన్నాయి. అప్పటికి ముంబై ఇండియన్స్ గెలవడానికి 11 బంతుల్లో 24 పరుగులు అవసరం అయ్యాయి.
ఆ దశలో రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అతని స్థానంలో మిఛెల్ శాంట్నర్ క్రీజ్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ- జట్టు ఓటమి కోరల నుంచి తప్పించుకోలేకపోయింది. శాంట్నర్‌కు హిట్టింగ్ అవకాశమే రాలేదు. రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా స్ట్రైక్‌ను రొటేట్ చేయలేకపోయాడు. సింగిల్స్ తీసి, శాంట్నర్‌కు బ్యాటింగ్ అవకాశం ఇవ్వలేదు.
తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ కావడానికి గల కారణాలను హెడ్ కోచ్ మహేల జయవర్ధనె వెల్లడించాడు. సూర్యకుమార్ యాదవ్‌తో తిలక్ వర్మ మంచి భాగస్వామ్యాన్ని అందించాడని, అతను అవుట్ అయిన తరువాత అంచనాలకు తగ్గట్టుగా ఇన్నింగ్ ముందుకు సాగలేదని చెప్పాడు. తిలక్ వర్మ రిథమ్ అందుకుంటాడని ఆశించినప్పటికీ అలా జరగలేదని పేర్కొన్నాడు.
భారీగా పరుగులు సాధించాల్సిన డెత్ ఓవర్లల్లో తిలక్ వర్మ క్రీజ్‌లో ఇబ్బంది పడ్డాడని, తడబడ్డాడని వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో కొత్త బ్యాటర్ ఎవరైనా క్రీజ్‌లో ఉంటే బాగుంటుందని భావించినట్లు జయవర్దనె చెప్పాడు. అంతకుమించి- మరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు.
ఓ బ్యాటర్‌ను రిటైర్డ్ అవుట్ చేయడం మంచిది కాదని, అయినప్పటికీ- అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. ఇది పూర్తిగా వ్యూహాత్మమేనని, గేమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నామని అన్నాడు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications