ముంబై ఇండియన్స్ లో బిగ్ వికెట్ డౌన్- తెగిన పదేళ్ల అనుబంధం

ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ లో బిగ్ వికెట్ పడింది. ఆ జట్టు హెడ్ కోచ్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. దీంతో.. ముంబై ఇండియన్స్ జట్టుతో జయవర్ధనేకు ఉన్న దాదాపు దశాబ్ద కాలం నాటి సుదీర్ఘ అనుబంధానికి తెరపడినట్టయింది. ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.

ముంబై ఇండియన్స్ సాధించిన అనేక విజయాల్లో మహేల జయవర్దనే పోషించిన పాత్ర కీలకం. హెడ్ కోచ్‌గా వేర్వేరు విడతల్లో రెండుసార్లు పనిచేశారు. మొదటిసారిగా 2017 నుంచి 2022 వరకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. 2017, 2019, 2020 సీజన్ లల్లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా ఆవిర్భవించింది. ఆయన మొదటి అయిదేళ్ల కాలంలో ఏకంగా మూడుసార్లు కప్ ను అందుకుందా జట్టు. అంతగా రాటుదేల్చారు మహేల.

Mahela Jayawardene stepping down as the head coach of Mumbai Indians for the next IPL season

ఆ తర్వాత 2024లో మళ్లీ హెడ్ కోచ్ రీఅపాయింట్ అయ్యారు. ఈ సీజన్ వరకూ కొనసాగారు. పక్కా ప్లానింగ్, ప్రతికూల పరిస్థితుల్లో సమర్థవంతమైన నిర్ణయాలతో జట్టును విజయపథంలో నడిపించిన గొప్ప వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఐపీఎల్ కే పరిమితం కాలేదు మహేల. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎక్స్ పాన్షన్ లోనూ ప్రముఖ పాత్ర పోషించారు. 2022లో ఆయన గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ గా కొత్త బాధ్యతలు స్వీకరించారు.
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ అవుట్
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ అవుట్

ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల లీగ్‌లలో ఉన్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలను సమన్వయం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో ముంబై ఇండియన్స్ విమెన్స్ టీమ్, విదేశీ లీగ్‌లకు చెందిన ఎంఐ న్యూయార్క్, ఎంఐ ఎమిరేట్స్ జట్లు ఆయా టోర్నీలలో ఛాంపియన్లుగా నిలిచాయి. పదవి నుంచి వైదొలిగిన అనంతరం మహేల జయవర్ధనే స్పందించారు. ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనదని వ్యాఖ్యానించారు.

వెస్టిండీస్ తో చివరి మ్యాచ్ వేళ.. టీమిండియాకు భారీ కుదుపు: స్టార్ బౌలర్ అవుట్: ఆ వెటరన్ కు చోటు
వెస్టిండీస్ తో చివరి మ్యాచ్ వేళ.. టీమిండియాకు భారీ కుదుపు: స్టార్ బౌలర్ అవుట్: ఆ వెటరన్ కు చోటు

గత పదేళ్లుగా తనపై ఎనలేని నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీ యజమానులు నీతా అంబానీ, ఆకాష్ అంబానీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, కోట్లాది మంది అభిమానులు అందించిన మద్దతు ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. నీతా అంబానీ కూడా జయవర్ధనే సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వ పటిమ, క్రికెట్ పట్ల ఉన్న అంకితభావం జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాయని ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+