Manu Bhaker-Neeraj Chopra: ఒలింపిక్ మెడలిస్ట్ లు మనూభాకర్-నీరజ్ చోప్రా పెళ్లి ? పెద్దల క్లారిటీ..
తాజాగా జరిగిన పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా భారత్ కు మూడు పతకాలు అందించి మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన ఇద్దరు యువ క్రీడాకారులు మనూ బాకర్, నీరజ్ చోప్రా మధ్య ప్రేమ చిగురించిందా ? త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా ? తన కూతురిని పెళ్లి చేసుకోమని నీరజ్ చోప్రాను మనూ బాకర్ తల్లి ఒట్టు వేయించుకుందా ? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఒలింపిక్ మెడలిస్టులు భార్యాభర్తలవుతారా అన్న చర్చ జరుగుతోంది.
తాజా ఒలింపిక్స్ లో రైఫిల్ షూటర్ మనూ బాకర్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించారు. వాస్తవానికి క్రీడల్లో ఇది సహజమే అయినా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం చూస్తే అంతకు మించి ఏదో జరుగుతోందన్న చర్చ జరిగింది. అదే సమయంలో మనూ బాకర్ తల్లి కూడా నీరజ్ చోప్రాతో కలిసి కనిపించడం, మధ్యలో తలపై ఒట్టు వేయించుకోవడం చూస్తే ఈ యువ క్రీడాకారుల మధ్య ప్రేమ చిగురించే ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మనూబాకర్ తండ్రి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

నీరచ్ చోప్రాతో ప్రేమ, పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించిన మనూ తండ్రి రామ్ కిషన్ బాకర్ .. ఆమె ఇంకా చిన్నపిల్లే అన్నారు. ఆమెకింకా పెళ్లి వయసు రాలేదని, అసలు తాము ఆ విషయం గురించే ఆలోచించడం లేదని తేల్చిచెప్పేశారు. అదే సమయంలో నీరజ్ చోప్రా బంధువు ఒకరు కూడా స్పందించారు. నీరజ్ ఒలింపిక్ పతకం తెచ్చినప్పుడు దేశమంతటికీ ఎలా తెలిసిందో పెళ్లి చేసుకుంటే కూడా అలాగే తెలుస్తుందని స్పష్టం చేశారు. దీంతో నీరజ్ కు రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చేసినట్లయింది. మరి ఈ రెండు క్లారిటీలతో రూమర్లకు చెక్ పడుతుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications