Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL Auction 2025: ముంబై ఇండియన్స్ వద్ద 9 మంది ఆటగాళ్లే..!

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం 2025 విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం వేలం ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన వేలం రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చారు. ఆదివారం వారం వేలంలో ప్రాంచేజీలు పోటీ పడి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. సోమవారం కూడా వేలం కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు వేలం ప్రారంభం కానుంది. ఆదివారం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లనే కొనగోలు చేసింది.

ముంబై ఇండియన్స్ మొదటి రోజు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కోసం భారీ మొత్తం వెచ్చించింది. ట్రెంట్ బౌల్ట్ ను రూ.12.5 కోట్లకు కొనుగోలు చేయగా.. నమన్ ధీర్ ను రూ.5.2 కోట్లు, రాబిన్ మింజ్ రూ.65 లక్షలు, కరణ్ శర్మ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఎంఐ జస్ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా (16.35 కోట్లు), రోహిత్ శర్మ (16.30 కోట్లు), తిలక్ వర్మ (8 కోట్లు)కు రిటైన్ చేసుకుంది.

ఐపీఎల్ వేలం 2025 LIVE: ముగిసిన తొలి రోజు వేలం.. 84 మంది ఆటగాళ్ల వేలం!

Mumbai Indians will be actively participating in the auction on the second day

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ లో తొమ్మిది మంది ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యాకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఆదివారం వేలంలో రూ.18.85 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు మొత్తం రూ.93.85 ఖర్చు చేసింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పర్స్ లో రూ.26.15 కోట్లు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ సోమవారం వేలంలో తప్పని సరిగా ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. కీలక ఆటగాళ్లు కూడా అవసరం. ప్రస్తుతం ఆ జట్టు 16 మంది స్వదేశీ ఆటగాళ్లు, ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతీ జట్టు గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు, కనిష్ఠంగా 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎంఐ వద్ద 9 మంది ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఆ జట్టు గరిష్ఠంగా 16 మంది ఆటగాళ్లను, కనిష్ఠంగా 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. గత ఐపీఎల్ ల్లో ముంబై ఇండియన్స్ మంచి రికార్డు ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+