హార్దిక్ పాండ్యాకు మరో షాక్..భార్య విడాకులు..?
టీమిండియా స్టార్ ఆటగాడు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హార్దిక్ పాండ్యాకు తన భార్య నటాషా విడాకులు ఇవ్వబోతున్నారనేది ఈ వార్త సారాంశం. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పుట్టిన రోజు సందర్భంగా నటాషా ఎలాంటి పోస్ట్ , విషెష్ కానీ చెప్పలేదు. దీంతో వీరి రిలేషన్‌లో చీలిక వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ జంట తాము ఎక్కడి వెళ్లిన కూడా వాటికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు.
అయితే ఇటీవల వీరిద్దరి నుంచి ఎలాంటి ఫొటోలు లేకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువ అయ్యాయి. అయితే హార్దిక తన భార్య ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించకపోవడంతో ఇదింతా కూడా పుకార్లే అని ఆయన అభిమానులు కొట్టిపారేస్తున్నారు.యిన బాలీవుడ్ హీరోయిన్ అ నటాషాను హార్దిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరు పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఇక ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. ముంబై టీంకు హార్దిక్ పాండ్యా తొలిసారి నాయకత్వం వహించారు.

ఐపీఎల్‌లో అత్యధికంగా టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కాదని.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తొలగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌ను తొలగించి హార్దిక్ పాండ్యాకు ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ ముంబై ఇండియన్స్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది. హార్దిక్ పాండ్యా ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఫెయిల్ అయి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ముంబై జట్టు ఫైనల్‌కి రాకపోవడానికి కారణం హార్దిక్, తన భార్యతో రిలేషన్ ఇష్యూనే అయి ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. విడాకుల వార్తలపై హార్దిక్ నోరు విప్పితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications