India-Pakistan Match: భారత్ తో మ్యాచ్ పై తేల్చేసిన పాక్-కీలక ప్రకటన..!
టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ (india pakistan match)పై క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడటంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టుకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ చూడలేమని ఆందోళన చెందుతున్న అభిమానులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది.
భారత్-పాక్ మ్యాచ్ వివాదం (india pakistan match)
భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుంచి తప్పించడంతో భారత్ తో జరిగే మ్యాచ్ లు తాము ఆడబోమని, శ్రీలంకకు వేదిక మార్చాలని పాకిస్తాన్ కోరింది. దీనికి ఐసీసీ అంగీకరించకపోవడంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. ఆ తర్వాత బంగ్లాకు ఐసీసీ అన్యాయం చేసిందని ఆరోపిస్తూ, ఆ జట్టుకు సంఘీభావంగా తాము భారత్ తో జరిగే మ్యాచ్ ఆడకూడదని పాకిస్తాన్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేసింది.

తోకముడిచిన పాకిస్తాన్
అయితే భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే దాదాపు 4500 కోట్ల నష్టాల్ని చవిచూడాల్సిన పరిస్ధితుల్లో ఐసీసీ.. చర్చలకు తెరలేపింది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న చర్చల్లో పాకిస్తాన్ ను బంగ్లాదేశ్, శ్రీలంక కూడా భారత్ తో మ్యాచ్ పై యూటర్న్ తీసుకోవాలని కోరాయి. దీంతో చివరికి పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.ఇందులో ఫిబ్రవరి 15న T20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తమ క్రికెట్ జట్టును మైదానంలోకి దిగడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది.

భారత్ తో మ్యాచ్ ఆడతామని ప్రకటన
బహుపాక్షిక చర్చలలో సాధించిన ఫలితాలు, అలాగే స్నేహపూర్వక దేశాల అభ్యర్థన దృష్ట్యా, పాకిస్తాన్ ప్రభుత్వం తమ జాతీయ క్రికెట్ జట్టును ఫిబ్రవరి 15, 2026న ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్‌లో జరగాల్సిన మ్యాచ్ కోసం మైదానంలోకి దిగాలని ఇందుమూలంగా ఆదేశిస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, క్రికెట్ స్ఫూర్తిని కాపాడటం, ఇందులో పాల్గొనే అన్ని దేశాలలో ఈ ప్రపంచ క్రీడ కొనసాగింపుకు మద్దతు ఇవ్వడం అనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో పాకిస్తాన్ క్రీడా రాజకీయాలు ఎలా ఉన్నా అభిమానులు మాత్రం ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications