మన మాటలు మనం ఊహించని గాయాలు రేపుతాయి..!!
పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు టీమిండియా విమెన్ టీమ్ వైస్ కేప్టెన్ స్మృతి మంధాన తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకు ముగింపు పలకాలని కోరారు. పెళ్లి రద్దు చేసుకోవడానికి గల కారణాలను స్మృతి మంధాన వివరించలేదు. తనకు ప్రైవసీ కావాలని చెప్పారు.
దీనిపై తాజాగా పలాష్ ముచ్చల్ స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. స్మృతి మంధానాతో తన వివాహం జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అత్యంత క్లిష్టమైనదని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా ఎంతో ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నానని, ఇప్పుడు పాత సంబంధాల నుంచి బయటపడి జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

తనపై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి న్యాయపరమైన చర్యలు తప్పవని పలాష్ ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి పలాష్ ముచ్చల్ తన పోస్ట్‌లో వివరించారు. ఈ బ్రేకప్ నుంచి వీలైనంత త్వరగా కోలుకుని, జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నానని, వ్యక్తిగత సంబంధాల నుంచి దూరం అవుతున్నానని తేల్చి చెప్పారు.
తన వ్యక్తిగత విషయాల గురించి ప్రజలు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారని, ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని చూడటం చాలా కష్టంగా ఉందని పలాష్ వ్యాఖ్యానించారు. ఇది తన జీవితంలో అత్యంత కఠినమైన సమయం అని, దీన్ని ఎదుర్కొంటానని అన్నారు. ఎటువంటి నిర్ధారణ లేకుండా, అవాస్తవాలు, పుకార్ల ఆధారంగా ఏ వ్యక్తి గురించి అయినా ఒక అభిప్రాయం చెప్పే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విషయం ఎంత వరకు నిజం అనేది తెలుసుకోవాలని సూచించారు. మన మాటలు కొన్నిసార్లు మనం ఊహించని విధంగా తీవ్ర గాయాలను చేస్తాయని పేర్కొన్నారు.
తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పలాష్ ముచ్చల్ స్పష్టం చేశారు. ప్రపంచంలో చాలామంది తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో మనం ఈ పెళ్లి విషయాల గురించి చర్చించడం సహేతుకం కాదని, తప్పుడు, పరువు నష్టం కలిగించే మాటలను ప్రచారం చేసే వారిపై తన టీమ్ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications