తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్!

భారత యువ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటి ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ సంతోషకరమైన వార్తను మార్చి 8, 2026న తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా.. అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్- పృథ్వీ షా
తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పృథ్వీ షా రాసిన నోట్ అందరినీ ఆకట్టుకుంటోంది. "మైదానంలో సిక్సర్లు బాదడం నుంచి.. జీవితాంతం మైదానం వెలుపల కూడా అదే జోరు కొనసాగించేలా.. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్" అంటూ తన కాబోయే భార్యపై ఉన్న ప్రేమను ఎంతో భావోద్వేగంతో పృథ్వీ షా వ్యక్తపరిచాడు. ఈ పోస్ట్‌లో పృథ్వీ షా మోకాళ్లపై కూర్చుని ఆకృతికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలు, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉంగరాలను ప్రదర్శిస్తున్న దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి.

Prithvi Shaw Engaged Indian Cricketer Announces New Innings with Akriti Agarwal Photos Viral

ఎవరీ ఆకృతి అగర్వాల్?
పృథ్వీ షా కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ గురించి చెప్పాలంటే ఆమె ఒక మల్టీ-టాలెంటెడ్ పర్సనాలిటీ. ఆకృతి లక్నోకు చెందినవారు కాగా.. ఉన్నత చదువుల నిమిత్తం ముంబైకి వచ్చి, అక్కడ మోడలింగ్, సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేశారు. ఇన్ఫ్లుయెన్సర్‌గా ఆమెకు దాదాపు 30 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. అంతేకాకుండా 'త్రిముఖ' అనే తెలుగు సినిమాతో వెండితెరకు కూడా పరిచయమై నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో మొదలైన చర్చ
నిజానికి ఈ జంటపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ వివాహ వేడుకలో పృథ్వీ షా, ఆకృతి కలిసి సందడి చేశారు. అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. అర్జున్ పెళ్లిలో వీరిద్దరూ జంటగా కనిపించడంతో, ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయని అందరూ అభినందనలు కురిపిస్తున్నారు.

క్రికెట్ కెరీర్.. కొత్త ఆశలు
పృథ్వీ షా క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ గతంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ కోల్పోవడం వంటి కారణాలతో జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ, తన పట్టుదలను వీడలేదు. తాజాగా డొమెస్టిక్ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శనతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన షా.. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడబోతున్నాడు. ఈ కొత్త ఇన్నింగ్స్ అతని కెరీర్‌కు కూడా సరికొత్త ఊపునిస్తుందని, వ్యక్తిగత జీవితంలో స్థిరపడటం అతని ఆటతీరుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+