World Cup 2023: రచిన్ రవీంద్ర స్టెప్ ఇన్ హైదరాబాద్ - తేజ రెడీ, గ్రౌండ్ ఆదిరేలా..!!

ప్రపంచ కప్ లో మరో మ్యాచ్ కు నేడు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన న్యూజీలాండ్ మరో పోరుకు సిద్దమైంది. ఉప్పల్ స్టేడియంలో సోమవారం నెదర్లాండ్స్ లో తలపడనుంది. నెదర్లాండ్స్ చిన్న టీం అయినా..వారి పోరాట పటిమ మాత్రం అద్బుతంగా ఉంది. ఇక...రెండు టీంల్లోనూ భారత మూలాలు ఉన్న ఆటగాళ్ల విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెలుగు ఫ్యాన్స్ సిద్దమయ్యారు. రచిన్ రవీంద్ర పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ ఫ్యాన్స్ వెయిటింగ్:హైదరాబాద్ లో మరో ప్రపంచ కప్ మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. ఈ రోజు మ్యాచ్ లో న్యూజిలాండ్ టీం నెదర్లాండ్స్ లో ఆడనుంది. ఉప్పల్ లో జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో ఆడిన నెదర్లాండ్స్ ఓటమి చెందిన పోరాట పటిమ ప్రదర్శించిది. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆ జట్టు ఆకట్టుకుంది. పూర్ి ఫిటనెస్ లేకపోవటంతో తొలి మ్యాచ్ కు దూరమైన కివీస్ కెప్టెన్ కేన్ వియమ్సన్ నెదర్లాండ్స్ తో పోరుకూ దూరమయ్యారు. టీం కెప్టెన్ గా లేథమ్ కొనసాగుతున్నాడు. నెదర్లాండ్స్ తో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ కివీస్ నెగ్గింది. ఇక, ఈ మ్యాచ్ లో మరో ప్రత్యేకత ఉంది. రెండు టీంల్లోనూ భారతీయ మూలాలు ఉన్న క్రికెటర్లు హైదరాబాద్ కేంద్రంగా గ్రౌండ్ లో తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు.

Rachin Ravindra, Teja Nidmanuru step onto the field for World Cup match at Hyderabad on Monday

తెలుగు గడ్డతో సత్సంబంధాలు:నెదర్లాండ్స్ టీంలో తెలుగు బిడ్డ తేజ నిడమానూరు సొంత గడ్డ పైన రెండో మ్యాచ్ ఆడనున్నాడు. తొలి మ్యాచ్ లో అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోయిన తేజ..తన కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్ లో కివీస్ తో మ్యాచ్ కు సిద్దమయ్యాడు. విజయవాడలో జన్మించిన తేజ సొంత గడ్డపైన ఏ రకంగా ఆడబోతున్నాడనేది ఆసక్తిని పెంచుతోంది. ఇక, ఇదే టీంలో భారత మూలాలు ఉన్న ఆర్యన్ దత్, విక్రమ్ సింగ్ ఆట పైన హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సుకత చూపిస్తున్నారు. గెలుపు కంటే వారి ఆట తీరు ఆస్వాదించేందుకు సిద్దం అవుతున్నారు. ఇక..ఇదే మ్యాచ్ లో న్యూజిలాండ్ టీం నుంచి సెన్సేషనల్ క్రికెటర్ గా ఒక మ్యాచ్ లోనే ఫ్యాన్స్ ను తన వైపు తిప్పుకున్న రచిన్ రవీంద్ర ఆట పైన ఆసక్తి పెరుగుతోంది.

ఉప్పల్ స్టేడియంలో మెరుస్తారా:ఇంగ్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విలియమ్సన్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఈ యువ సంచలనం మూలాలు భారత్ వే. తొలి ప్రపంచ కప్ మ్యాచ్ లోనే సెంచరీ సాధించి రికార్డు క్రియేట్ చేసాడు. 96 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్ లతో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ లో ఉన్నా..క్రికెట్ లో మెళకువలు మాత్రం ఏపీలోనే నేర్చుకున్నాడు. ప్రతీ ఏడాది అనంతపురం కు వచ్చి ట్రైనింగ్ తీసుకొనే వాడు. రవీంద్ర తండ్రికి న్యూజిలాండ్ లో హాట్ కిక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ఉంది. రవీంద్ర తండ్రికి సచిన్, ద్రవిడ్ అంటే చాలా ఇష్టం. వారిద్దరి పేర్లతో తన కుమారుడు పేరు పెట్టారు. ఇప్పుడు తెలుగు గడ్డతో సంబంధాలు ఉన్న రవీంద్ర ఆట కోసం హైదరాబాద్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+