బిగ్ షాక్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ

టీమ్ ఇండియా సారథి రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు గుడ్ బై చెబుతూ తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశాడు. ఈ రోజు నుంచే రిటైర్ మెంట్ అమలు అవుతున్నట్లు పేర్కొన్నాడు.

Rohit Sharma Announces Retirement from Test Cricket

తన ఇన్ స్టా ఖాతాలో రోహిత్ శర్మ ఇలా పోస్టు చేశాడు. అందరికీ నమస్కారం.నేను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికాను. ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. ఈ ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. ఇంతకాలం నాపై ప్రేమ చూపించి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వన్డే క్రికెట్‌లో కొనసాగుతా.. అని రోహిత్ శర్మ తెలిపాడు. హిట్ మ్యాన్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు.

2013లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరానికి చేర్చాడు. టెస్టుల్లో 67 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 4,301 పరుగులు చేశాడు. వీటిలో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాది రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. తాజాగా టెస్టులకూ గుడ్ బై చెప్పాడు. ఇక ప్రస్తుతం వన్డేలో హిట్ మ్యాన్ కొనసాగుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+