Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోహిత్ ను అనవసరంగా తప్పించామా? ముంబై అంతర్మథనం-కెప్టెన్సీ అలా ఉంది మరి..

పసికూన ఆప్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ తో పొట్టి ఫార్మాట్ లో పునరాగమనం చేసిన రోహిత్ శర్మ (Rohit Sharma)తొలి రెండు మ్యాచ్ ల్లో వ్యక్తిగతంగా విఫలమైనా జట్టును మాత్రం విజయాల దిశగా నడిపించాడు. చివరి మ్యాచ్ లో అయితే జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు మెరుపు సెంచరీ సాధించడమే కాకుండా రెండు సూపర్ ఓవర్లకు వెళ్లిన మ్యాచ్ లో తన కెప్టెన్సీతో టీమిండియాకు అరుదైన విజయం అందించాడు. దీంతో ఆప్ఘన్ సిరీస్ వైట్ వాష్ కావడమే కాదు ఎన్నో రికార్డులు సాధించేందుకు పనికొచ్చింది.

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా సిద్దమవుతున్న వేళ.. ఆప్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ సాధించిన విజయం అన్ని విధాలుగా రోహిత్ సేనకు పనికొచ్చింది. అంతే కాదు రోహిత్ శర్మ కెప్టెన్సీ స్ధాయిని అందరికీ గుర్తుచేసింది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించే అన్ని చోట్లా చర్చ జరుగుతోంది. తాజాగా క్రిక్ బజ్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం రోహిత్ కెప్టెన్సీని ఆకాశానికెత్తేశాడు.

rohit sharmas exceptional captaincy show put pressure on mumbai indians ahead of IPL 2024

రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్ పరీక్షించడానికి టీ20 సరైన ఫార్మాట్ అని గవాస్కర్ తెలిపాడు. ధోనీ, కొహ్లీ కంటే ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్ గా రోహిత్ మారడాన్ని బట్టి చూస్తుంటే అతని కెప్టెన్సీ స్ధాయి అర్ధమవుతోందన్నాడు. ముఖ్యంగా ఆప్ఘన్ తో చివరి మ్యాచ్ లో రింకూ సింగ్ తో కలిసి రోహిత్ ఆడిన కెప్టెన్సీ ఇన్నింగ్స్ కచ్చితంగా టాప్ అని గవాస్కర్ తెలిపాడు. దీంతో రోహిత్ కెప్టెన్సీ విషయంలో సీనియర్లు, దిగ్గజాలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో అర్ధమవుతోంది. ఇవన్నీ రోహిత్ ఆడుతున్న ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై ఒత్తిడి పెంచేస్తున్నాయి.

ఐపీఎల్ 2024(IPL 2024) కోసం రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి తెచ్చుకుని కెప్టెన్సీ కూడా అప్పగించిన ముంబై ఇండియన్స్ కు ఆప్ఘనిస్తాన్ తో తొలి రెండు మ్యాచ్ ల తర్వాత తమ నిర్ణయం సరైనదే అనిపించింది. కానీ చివరి మ్యాచ్ లో రోహిత్ ఆడిన కెప్టెన్సీ ఇన్నింగ్స్, ఆ తర్వాత సూపర్ ఓవర్లలో రోహిత్ నిర్ణయాలు చూస్తుంటే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కచ్చితంగా బాధపడుతుండవచ్చు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి వదులుకోవాలన్న ముంబై నిర్ణయం ప్రభావం రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉండొచ్చని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+