హిట్ మ్యాన్ కొత్త కారు చూసిండ్రా? నంబర్ 3015 వెనుక ఉన్న లవ్ స్టోరీ ఇగ జూడండ్రి!
Rohit Sharma New Car: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కోసం కొత్త టెస్లా మోడల్ వై(Tesla Model Y) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. హై స్పీడ్ లగ్జరీ కార్లంటే ఇష్టపడే రోహిత్ శర్మ ప్రస్తుతం ఓ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లపై పెరుగుతున్న ఆసక్తి ఇప్పుడు హిట్ మ్యాన్‌ను కూడా ఆకర్షించింది. టెస్లా కార్ల అమ్మకాలు ఇండియాలో ప్రారంభం కాగానే, ఆయన ఈ మోడల్‌ను కొనుగోలు చేశారు. ఈ కారు నంబర్ ప్లేట్‌పై ఉన్న 3015 అనే నంబర్ ఈ భారత క్రికెట్ స్టార్‌కు చాలా స్పెషల్. టెస్టా మోడల్ వై ఫీచర్లు, నంబర్ ప్లేట్ వెనకన్న అసలు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిత్ కొనుగోలు చేసిన కొత్త టెస్లా మోడల్ వై ధర, ఫీచర్లు
ముందుగా రోహిత్ శర్మ కొత్త టెస్లా కారు గురించి చెప్పాలంటే.. ఆయన టెస్లా మోడల్ వై RWD స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌ను కొనుగోలు చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.89 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 75 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది.ది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చూడటానికి ఎంత అందంగా ఉందో, దాని ఫీచర్లు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి.

ఫీచర్లు ఇవే..
టెస్లా మోడల్ వై ఫీచర్ల గురించి మాట్లాడితే..ఇందులో ఆల్ ఎల్ఈడీ లైట్స్, ప్రీమియం ఇంటీరియర్, 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హీటెడ్- వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 9 స్పీకర్లతో కూడిన ప్రీమియం స్టీరియో సిస్టమ్, రియర్ వీల్ డ్రైవ్‌ట్రైన్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ కొలిజన్ వార్నింగ్, గ్లాస్ రూఫ్ వంటి కంఫర్ట్, సౌలభ్యం, భద్రతకు సంబంధించిన అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. టెస్లా మోడల్ వైలో 220 కిలో వాట్స్ మోటార్ అమర్చబడింది. ఇది 295 బీహెచ్‌పీ శక్తిని, 420 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
3015 నంబర్ వెనుక కథ ఏంటంటే?
వీటన్నింటి మధ్య రోహిత్ శర్మ కొనుగోలు చేసిన టెస్లా మోడల్ వై కారు నంబర్ ప్లేట్ 3015 ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో డిసెంబర్ 30న పుట్టిన రోహిత్ కూతురు బర్త్ డే తేదీ.. నవంబర్ 15 అతని కొడుకు పుట్టిన తేదీ ఉన్నాయి. ఇది రోహిత్ కు కూతురు, కొడుకులపై ఉన్న ప్రేమానుబంధాన్ని సూచిస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ లగ్జరీ కార్ల గురించి చెప్పాలంటే.. టీమిండియాకు చెందిన ఈ స్టార్ ఆటగాడికి వేగంగా అంటే చాలా ఇష్టం. రోహిత్ వద్ద లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ హెచ్ఎస్ఈ లాంగ్ వీల్‌బేస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 400డి, బీఎండబ్ల్యూ ఎం5, స్కోడా ఆక్టావియా, టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లు ఉన్నాయి.
Rohit Sharma spotted in his new Tesla!
— Indian Observer (@ag_Journalist) October 9, 2025
Hitman’s got style — both on and off the pitch. ⚡🚗#RohitSharma #Tesla #CricketStyle #Hitman #EVIndia #CelebrityCars #CricketStar #TeslaIndia #LuxuryLifestyle pic.twitter.com/KYtp1j5PaD












Click it and Unblock the Notifications