rohit sharma removal: రోహిత్ తొలగింపుపై మహేళ మరో వివరణ- టఫ్, ఎమోషనల్ అంటూ..

ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలగింపుపై అభిమానుల ఆగ్రహావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముంబై కి విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న హిట్ మ్యాన్ ను తొలగించాలన్న నిర్ణయాన్ని తప్పుబడుతూ తాజాగా నిర్వహించిన మినీ వేలం సందర్భంగా కూడా అభిమానులు యాజమాన్యానికి ప్రశ్నలు వేశారు. దీనిపై స్పందిస్తూ రోహిత్ కొనసాగుతాడంటూ వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఇంకా ఆ వేడి చల్లారడం లేదు.

రోహిత్ శర్మ స్ధానంలో గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించాలన్న ముంబై ఇండియన్స్ నిర్ణయంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో జట్టు గ్లోబల్ హెడ్ మహేళ జయవర్ధనే తాజాగా మరోసారి దీనిపై స్పందించాడు. జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఈ వ్యవహారంపై మహేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ను తొలగించాలన్న నిర్ణయం కఠినమైందని, భావోద్వేగంతో కూడుకున్నదని మహేళ వివరణ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం భవిష్యత్తు దృష్ట్యా రోహిత్ శర్మ తొలగింపు తప్పలేదని మహేళ చెప్పుకొచ్చాడు.

rohit sharma removal: mahela jayawardene defends again, says tough and emotional decision

రోహిత్ శర్మ తొలగింపుపై అభిమానులు స్పందిస్తున్న తీరును కూడా మహేళ సమర్ధించాడు. ఇది సహజమే అన్నాడు. నాయకత్వం లేకున్నా రోహిత్ శర్మ జట్టులో తన పాత్రకు న్యాయం చేస్తాడని మహేళ ధీమా వ్యక్తం చేశాడు. టీమ్ లోనూ, బయటా రోహిత్ మార్గదర్శనం జట్టులో యువ క్రికెటర్లకు చాలా అవసరమని తెలిపాడు. ముంబై జట్టు లెగసీలో రోహిత్ కూభాగస్వామ్యం ఉంది, ఉంటుందన్నాడు. ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో హార్ధిక్ పాండ్యాకు ఉన్న ప్రాముఖ్యత చాలా కీలకంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

హార్ధిక్ పాండ్యా గతంలోనూ ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నాడని, ఇప్పుడు పరిస్దితులేవీ అతనికి కొత్త కాదని మహేళ తెలిపాడు. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టును నడపడంతో పోలిస్తే ముంబై జట్టు కాస్త భిన్నమని వెల్లడించాడు. జట్టును తీర్చిదిద్దేందుకు పాండ్యాకు ఇది మంచి అవకాశమని మహేళ చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+