Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా దేవుడు ఆయనే

అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023 రసవత్తరంగా ఆరంభమైంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయఢంకా మోగించింది. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరు బ్లాక్ క్యాప్స్ కొట్టి అవతల పడేశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బ్యాటర్లు సమష్టిగా రాణించారు. న్యూజిలాండ్‌ ముందు భారీ స్కోర్‌ పెట్టారు. జానీ బెయిర్‌స్టో- 33, జో రూట్- 77, కేప్టెన్ జోస్ బట్లర్- 43 పరుగులు చేశారు. డేవిడ్ మలన్- 14, హ్యారీ బ్రూక్- 25, లియామ్ లివింగ్‌స్టొన్- 20, మొయిన్ అలీ- 11, సామ్ కుర్రన్- 14, క్రిస్ వోక్స్- 11, ఆదిల్ రషీద్- 15, మార్క్ వుడ్- 13 పరుగులు చేశారు.

England vs New Zealand

283 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ దుమ్ము లేపుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు విల్ యంగ్ అవుట్ అయ్యాడు. అతనిది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. అతని స్థానంలో ఫస్ట్ డౌన్‌గా రచిన్ రవీంద్ర క్రీజ్‌లోకి వచ్చాడు.

అక్కడ మొదలైంది న్యూజిలాండ్ పరుగుల సునామీ. ఇంగ్లాండ్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు. రెండో ఓవర్ తొలి బంతికి వికెట్ పడగొట్టిన బౌలర్లు.. మరో వికెట్ల కోసం మ్యాచ్ మొత్తం చెమటోడ్చాల్సి వచ్చింది. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర తలో సెంచరీ బాది అవతల పడేశారు. మ్యాచ్ మొత్తాన్నీ లాగేసుకున్నారు.

Rachin Ravindra Devon Conway

ఓవర్‌కు ఏడు పరుగులు చొప్పున పిండుకున్నారు వారిద్దరూ. 36.2 ఓవర్లలోనే 283 పరుగులు చేశారంటే వారి దూకుడు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాన్వే- 152, రచిన్ రవీంద్ర- 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇద్దరూ పోటీ పడి పరుగులు సాధించారు. సిక్సర్లు, ఫోర్లతో మోతెక్కించారు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో రచిన్ రవీంద్రకు ప్రమోషన్ ఇవ్వడం సత్ఫలితాన్ని ఇచ్చింది. దూకుడుగా ఆడే మనస్తత్వం ఉన్న రచిన్‌ను వామప్స్‌లో కూడా టాప్ ఆర్డర్, ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు పంపించింది న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్. అక్కడ అతను సక్సెస్ అయ్యాడు. అదే మెరుపుదాడినీ ఇక్కడా కంటిన్యూ చేస్తోన్నాడు.

పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా రచిన్ రవీంద్ర మాట్లాడాడు. తాను ఆడిన ఈ ఇన్నింగ్ నమ్మశక్యం కావట్లేదని నవ్వుతూ చెప్పాడు. ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం తన కేరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నాడు. తన జీవితంలో ఇదో గొప్ప రోజుగా అభివర్ణించాడు.

Sachin Tendulkar is my cricketing idol says New Zealand batter Rachin Ravindra said

ఇంగ్లాండ్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని, ప్రారంభంలో వారిని ఎదుర్కొనడానికి కొంత ఇబ్బంది పడ్డానని రచిన్ చెప్పాడు. డెవాన్ కాన్వేను అవుట్ చేయడంపైనే వారు దృష్టి పెట్టారని, అది తనకు కలిసి వచ్చిందని అన్నాడు. క్రీజ్‌లో కుదురుకోవడానికి, స్వేచ్ఛగా ఆడటానికి వీలు కల్పించినట్టయిందని విశ్లేషించాడు.

క్రికెట్‌లో తనకు స్ఫూర్తి సచిన్ టెండుల్కరేనని రచిన్ రవీంద్ర స్పష్టం చేశాడు. సచిన్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్నింటినీ ఇష్టపడతానని అన్నాడు. ఆయనను దేవుడిగా ఆరాధిస్తానని చెప్పాడు. తన తండ్రి సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్‌కు అతిపెద్ద అభిమాని కావడం వల్లే వారి పేర్లు కలిసి వచ్చిన రచిన్అని పేరుపెట్టారని అన్నాడు. సచిన్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, స్ఫూర్తి పొందానని వివరించాడు.

Sachin Tendulkar

కాన్వే తనకు చాలా క్లోజ్ మేట్స్ కావడం వల్ల క్రీజ్‌లో ఉన్నప్పుడు అతను ఇచ్చిన కొన్ని టిప్స్.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడ్డాయని రచిన్ తెలిపాడు. కాన్వేతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని తాను ఎంజాయ్ చేశానని, అలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నానని అన్నాడు.

నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో తన క్లోజ్ ఫ్రెండ్ కాన్వే ఉండటాన్ని సౌకర్యంగా ఫీలయ్యానని, అతనితో ఛాట్ చేస్తూ- మ్యాచ్ ఆడటం చాలా బాగుందని కామెంట్స్ చేశాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియాన్ని గుర్తుకు తెచ్చిందని రచిన్ రవీంద్ర అన్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+