ఆవేదన వ్యక్తం చేసిన సచిన్ టెండుల్కర్- కేంద్రానికి ఫిర్యాదు..!!
Sachin Tendulkar: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఇదివరకు ఆయన కూతురు సారా టెండుల్కర్ ఫొటోలు మార్ఫింగ్‌కు గురయ్యాయి. ఇప్పుడు ఏకంగా సచిన్‌పైనే ఫేక్ వీడియో వదిలారు. ఓ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీని ప్రమోట్ చేస్తోన్నట్లుగా ఉన్న ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో అది.
స్కైవర్డ్ ఏవియేటర్ క్వెస్ట్.. అనే ఆన్‌లైన్ గేమ్‌ను ఆడటం ద్వారా తన కూతురు సారా టెండుల్కర్ రోజూ వేల రూపాయలను సంపాదిస్తోందంటూ సచిన్ టెండుల్కర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఉందా వీడియో. ఏవియేటర్ క్వెస్ట్ ద్వారా డబ్బులను ఇంత సులభంగా సంపాదించవచ్చా? అని తనకు ఆశ్చర్యం కలుగుతుంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారా వీడియోలో. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వైరల్‌గా మారింది.

దీనిపై సచిన్ రియాక్ట్ అయ్యారు. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని సృష్టించారని స్పష్టం చేశారు. ఈ వీడియో చూసి బాధపడ్డానని, అందులో చేసిన వ్యాఖ్యలు కలచి వేశాయనీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీ దుర్వినియోగమౌతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
These videos are fake. It is disturbing to see rampant misuse of technology. Request everyone to report videos, ads & apps like these in large numbers.
— Sachin Tendulkar (@sachin_rt) January 15, 2024
Social Media platforms need to be alert and responsive to complaints. Swift action from their end is crucial to stopping the… pic.twitter.com/4MwXthxSOM
ఇలాంటి వీడియోలు, అడ్వర్టయిజ్‌మెంట్లు, యాప్స్, ఇతర అప్లికేషన్స్‌పై రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి డీప్ ఫేక వీడియోల విషయంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సచిన్ టెండుల్కర్ సూచించారు. వాటిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయడాన్ని బాధ్యతగా భావించాలని కోరారు.
టెక్నాలజీ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డీప్ ఫేక్ వీడియో వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లారు సచిన్ టెండుల్కర్. డీప్ ఫేక్స్, ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్.. మరింతగా విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications