విడిపోవడం కష్టంగా ఉంది -సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులకు రెడీ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆమె గత కొంతకాలంగా తన భర్త షోయబ్ మాలిక్‌కు దూరంగా ఉంటున్నారు. విభేదాలు తలెత్తడంతో..ఈ జంట ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో సానియా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలోనే ఎక్కువుగా ఉండటంతో సానియా మీర్జా - షోయబ్ మాలిక్ విడిపోతున్నారనే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది.
ఇదే సమయంలో సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్త షోయబ్‌తో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించింది. అటు షోయబ్ మాలిక్ సైతం ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భార్య సానియా మీర్జా పేరును తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ సానియా మీర్జా తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది.

పెళ్లి కష్టం.. విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. అలాగే లావుగా ఉండటం కష్టమే.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. అప్పు ఉండటం కష్టం. ఆర్థిక నియమం పాటించడమూ కష్టమే. మీరు సరైన దాన్ని ఎంచుకోండి. ఇతరులతో ఎటువంటి సమాచారం లేకుండా ఉండటం కష్టమే అప్పుడే జీవితం కఠినంగా మారుతుంది.
మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన తరువాత సానియా మీర్జా తన విడాకులు గురించే ఇలా తెలిపిందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. సానియా మీర్జా తొందరలోనే షోయబ్ మాలిక్‌తో విడిపోతుందని.. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2010లో పాకిస్థానీ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్‌ను సానియా ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇజాన్ మీర్జా అనే మగబిడ్డ ఉన్నాడు.












Click it and Unblock the Notifications