విడాకులకు రెడీ అయిన సానియా మీర్జా..? భర్త ఫొటోలు డిలీట్ చేయడంతో క్లారిటీ

టెన్నిస్ సంచలనం సానియా మీర్జా (Sania Mirza divorce) విడాకులకు రెడీ అవుతుందనే వార్త సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. పాకిస్థానీ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్‌‌ను సానియా 2010లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇజాన్ మీర్జా అనే మగబిడ్డ ఉన్నాడు. అయితే సానియా మీర్జా -షోయబ్ మాలిక్‌‌ సంసార జీవితం గురించి అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి.

భర్త షోయబ్ మాలిక్‌తో సానియా విడిపోయిందని.. వీరి మధ్య అంత సఖ్యత లేదనే పుకార్లు సోషల్ మీడియాలో చాలాకాలంగా వైరల్ అవుతున్నాయి. సానియా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలోనే ఎక్కువుగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. అయితే ఈ పుకార్లపై వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడింది లేదు.

Sania Mirza Deleted All Her Pictures With Shoaib Malik From Instagram

కానీ తాజాగా సానియా మీర్జా (Sania Mirza divorce)తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్త షోయబ్‌తో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించింది. అటు షోయబ్ మాలిక్‌ సైతం ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి తన భార్య సానియా మీర్జా పేరును తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Sania Mirza Deleted All Her Pictures With Shoaib Malik From Instagram

ఈ కారణంగా మరోసారి సానియా మీర్జా -షోయబ్ మాలిక్‌ విడాకుల వార్త నెట్టింట సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ జంట ఒకరి గురించి ఒకరు పోస్ట్ చేసి చాలా కాలం అయ్యింది. దాంతో ఈ జంట విడాకుల ఊహాగానాలను మరింత పెంచినట్టైంది. షోయబ్‌తో రిలేషన్ అంతగా బాలేకపోవడంతోనే..సానియా తన భర్త ఫొటోలను తొలగించిందని ఓ ప్రముఖ వెబ్‌సైట్ పేర్కొంది.

అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఎప్పటిలాగే తమ విడాకుల పుకార్లపై ఈ జంట మౌనం వహిస్తారో లేదా..బయటకు వచ్చి విడాకుల వార్తలను ఖండిస్తారో చూడాలి. ప్రస్తుతానికి అయితే సానియా మీర్జా (Sania Mirza divorce) తన భర్త ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించడం సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+