శుభ్ మన్ గిల్, సారా తెందూల్కర్ లో ఎవరు పెద్ద..? ఈ షాకింగ్ నిజాలు తెలుసా..?
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాల ప్రేమాయణంపై ఎప్పట్నించో వార్తలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఆ ప్రేమ వార్తల గురించి అటు గిల్ గాని, ఇటు సారా గాని ఇప్పటివరకు స్పందించలేదు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావటం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్స్ పెడుతుండడంతో ఎప్పటికప్పుడు వీరి రిలేషన్ షిప్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరి గురించి అనేక విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
శుభ్ మన్ గిల్ టీమ్ ఇండియాలో కీలక ఆటగాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాది ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. ప్రస్తుతం వన్డే టీమ్ కు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు గిల్. గుజరాత్ టైటాన్స్ టీమ్ కు కెప్టెన్ గానూ ఉన్నాడు. పంజాబ్ కు చెందిన గిల్.. పంజాబ్ డొమెస్టిక్ టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడు. ఇక సారా టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటుంది సారా.

గిల్, సారాలో ఎవరు పెద్ద..?
శుభ్ మన్ గిల్ సెప్టెంబర్ 18, 1999లో జన్మించాడు. ప్రస్తుతం అతనికి 25ఏళ్లు ఉన్నాయి. ఇక సారా టెండూల్కర్ అక్టోబర్ 12, 1997లో జన్మించింది. ఈమె ప్రస్తుత వయసు 27 ఏళ్లు. అంటే గిల్ కంటే సారా దాదాపు సంవత్సరం పెద్ద అన్నమాట. ఇక చదువు విషయానికొస్తే.. పంజాబ్ మోహాలీలోని మానవ్ మంగల్ స్మార్ట్ స్కూల్ లో గిల్ టెన్త్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అండర్-19 జట్టులో చోటు సంపాదించాక స్టడీస్ పక్కన పెట్టాడు. ఇక సారా తన స్కూల్ లైఫ్ మొత్తం ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, ముంబయిలో పూర్తయింది. పై చదువులకోసం ఆమె లండన్ వెళ్లింది. క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ నూట్రిషన్ లో మాస్టర్స్ చేసింది.












Click it and Unblock the Notifications