T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో ఏబీ డివిలియర్స్ ఫేవరెట్ టీమ్ ఇదేనట !
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ కోసం అన్ని జట్లూ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాయి. ఈసారి వరల్డ్ కప్ నెగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్ లో అన్ని జట్లు పోటీ పడుతున్నా ఫేవరెట్ గా కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందులో తన ఫేవరెట్ ఏంటన్నది దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ చెప్పేశాడు. టీ20ల్లో అసాధారణ ప్రతిభ చూపిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఒకడైన ఏబీ అంచనా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఈసారి టీ20 వరల్డ్ కప్ లో ఆడుతున్న జట్లలో భారతే తన ఫేవరేట్ అని దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. భారత్ లో పటిష్టమైన దేశీయ క్రికెట్, ఐపీఎల్ వంటి కారణాలతో ఈసారి టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫేవరెట్ గా ఉందని ఏబీడీ తెలిపాడు. మెగా టోర్నీల్లో ఆడిన అనుభవం, ఫైనల్ కు చేరే క్రమంలో ఉన్న అనుభవం వంటివి కచ్చితంగా టీమ్ ఇండియాకు ఉపయోగపడతాయని డివిలియర్స్ అంచనా వేస్తున్నాడు.

ఈసారి టీ20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ అవకాశాలు ఉన్న జట్లలో ఇండియా కూడా ఒకటని, చాలా ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతుండటం భారత క్రికెట్ ను క్షేత్రస్ధాయి నుంచి బలోపేతం చేసిందని డివిలియర్స్ తెలిపాడు. అలాగే ఎక్కువగా మెగా టోర్నీల్లో ఆడుతున్న అనుభవం కలిసొస్తుందన్నాడు. సరైన సమయంలో అవకాశాలను అందిపుచ్చుకుని, కొంచెం అదృష్టం కూడా కలిసి వస్తే టైటిల్ ఫేవరెట్ అవుతుందని ఏబీడీ అంచనా వేస్తున్నాడు.












Click it and Unblock the Notifications