IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్ వేళ సన్ రైజర్స్ షాకింగ్ నిర్ణయం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) ఫైనల్ దశకు చేరుకుంది. రేపు చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ మధ్య కాలంలో సన్ రైజర్స్ జట్టు ఫైనల్ కు చేరుకోకపోవడం, అందివచ్చిన అవకాశాన్ని ఏ మేరకు ఉపయోగించుకుని టైటిల్ కైవసం చేసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
రేపు జరిగే ఫైనల్ కు వేదికైన చేపాక్ స్టేడియంలో ఇప్పటికే నిన్న రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ లో ఆటగాళ్లు వాతావరణంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సముద్ర తీరంలో ఉన్న చేపాక్ స్టేడియంలో ఉక్కపోత భరించలేక చెమటతో తడిసి ముద్దయ్యారు. దీంతో ఆటపై మనసు పెట్టలేక వారు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ ను అనూహ్యంగా రద్దు చేసుకుంది.

వాస్తవానికి రేపు కీలకమైన ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న వేళ ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ చేపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టుకు ప్రాక్టీస్ సెషన్ ఏర్పాటు చేశారు. అయితే చెన్నైలో భారీ ఉక్కపోత, వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో ఆటగాళ్లు డీహైడ్రేషన్ కు గురైతే రేపటి ఫైనల్ పై ప్రభావం పడుతుందని జట్టు ఫ్రాంచైజీ భావించినట్లు తెలుస్తోంది. దీంతో కోచ్, ఇతర మేనేజ్ మెంట్ ప్రతినిధులతో మాట్లాడి ఈ సెషన్ క్యాన్సిల్ చేసుకుంది. అంటే రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ తర్వాత నేరుగా రేపు కోల్ కతా నైటరైడర్స్ తో ఫైనల్ ఆడేందుకు సన్ రైజర్స్ సిద్దమైంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications