మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్ ను శుభారంభం చేసింది. తన విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తోంది. గత ఏడాది ఐపీఎల్ సెమీస్, ఫైనల్స్ గెలిచిన జట్టు ఈ ఏడాది గ్రాండ్ ఓపెనర్ తో వేట మొదలుపెట్టింది. శనివారం రాత్రి బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. 202 పరుగులను ఊది అవతల పడేసింది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తేలిపోయింది. ప్రారంభం నుండీ వికెట్లను కోల్పోతూ వచ్చింది. అయినప్పటికీ 200లకు పైగా పరుగులు చేయగలిగిందంటే టాప్ ఆర్డర్ లో కేప్టెన్ ఇషాన్ కిషన్- 38 బంతుల్లో 80, మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్- 22 బంతుల్లో 31, లోయర్ మిడిలార్డర్ లో అనికేత్ వర్మ- 18 బంతుల్లో 43 సునామీ బ్యాటింగ్ వల్లే సాధ్యపడింది. ట్రావిస్ హెడ్- 11, అభిషేక్ శర్మ- 7, నితీష్ రెడ్డి- 1, సలీల్ అరోరా- 9, హర్ష్ దుబే- 3, హర్షల్ పటేల్- 0 ఫ్లాప్ అయ్యారు.

ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ లోనే క్యాచ్ వివాదం తలెత్తింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ అవుట్ కావడం దీనికి కేంద్రబిందువు అయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోఆర్సీబీ బౌలర్ రొమారియో షెపర్డ్ షార్ట్‌బాల్‌కు క్లాసెన్ పుల్ షాట్ ఆడగా, బంతి డీప్ మిడ్‌వికెట్ వైపు దూసుకెళ్ళింది. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ దీన్ని అద్భుతంగా అందుకున్నాడు. సాల్ట్ క్యాచ్ పట్టిన సమయంలో అతని పాదం బౌండరీ స్పాంజ్‌ను తాకిందా అని సందేహాలు తలెత్తాయి.
బంతిని అందుకున్నప్పుడు ఫిల్ సాల్ట్ పాదం బౌండరీ లైన్ వద్ద కింగ్‌ఫిషర్ లోగో కుషన్‌కు తగిలిందనేది రీప్లేలో కనిపించింది. కాలు తగలడం వల్లే ఆ కుషన్ స్వల్ప కదలినట్లు వీడియోల్లో రికార్డయింది. ఇది డిబేట్ కు దారి తీసింది. బ్రాడ్‌కాస్ట్ బ్రేక్ తర్వాత టాప్ యాంగిల్ రీప్లే రావడంతో వివాదం మరింత ముదిరింది.
Your call. I believe the cushion clearly was displaced by Salt’s feet while completing the catch. Not out and six, bad call, don't know how you can fluff that up as a third umpire. Klaasen was not out.#IPL2026 https://t.co/yQDyLM6BY8 pic.twitter.com/7HzMiQqSvR
— Adarsh (@adarshisit) March 28, 2026
ఫిల్ సాల్ట్ పాదం బౌండరీ స్పాంజ్‌ను తాకినట్లు అనిపించిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తేల్చి చెప్పాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. థర్డ్ అంపైర్ తీసుకున్నది చాలా పెద్ద నిర్ణయమని వ్యాఖ్యానించాడు. పాదంలో ఏ భాగం స్పాంజ్‌ను తాకలేదని థర్డ్ అంపైర్ ఖచ్చితంగా ఎలా చెప్పగలడో తనకు అర్థం కావట్లేదని పేర్కొన్నాడు. పలువురు నెటిజన్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అన్ని యాంగిల్స్ లో దీన్ని చూడలేకపోయాడని కామెంట్స్ చేస్తోన్నారు.
Looked to me like the foot had touched the boundary sponge to me … that’s a big call for RCB .. #IPL2626 .. Not sure how you can give that out and be absolutely sure no part of the foot touched the sponge .. and the sponge moved .. a bit of a giveaway .. @cricbuzz
— Michael Vaughan (@MichaelVaughan) March 28, 2026
ఈ నిర్ణయంతో క్లాసెన్ కూడా అసహనంగా కనిపించాడు. బౌండరీ లైన్ వద్ద అధికారులతో వాదించాడు. అతని వికెట్ పడ్డ తర్వాతే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. మొమెంటమ్ దెబ్బతిన్నది. ఇషాన్ కిషన్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పే దశలో ఉన్న సమయంలో క్లాసెన్ అవుట్ కావడం అటు కేప్టెన్ ఏకాగ్రతను కూడా చెదరగొట్టింది. ఈ తర్వాత ఇషాన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోెయాడు.
-
IPL 2026: ఆర్సీబీ శుభారంభం.. సన్‌రైజర్స్‌కు ఘోర పరాజయం -
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
IPL ఫ్యాన్స్ కు బిగ్ షాక్ - మ్యాచులకు దూరంగా ధోనీ, CSK అధికారిక ప్రకటన..!! -
IPl 2026: బంగ్లాదేశ్ యూటర్న్-ప్రభుత్వం కీలక నిర్ణయం..! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications