తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. కేఎల్ రాహుల్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి స్వయంగా ధృవికరించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టినే కేఎల్ రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు హాజరైన సునీల్ శెట్టి కొన్ని ఆసక్తికర విషయానలను అభిమానులతో పంచుకున్నారు. ఈ షోలో కమెడియన్ భారతీ సింగ్ మాట్లాడుతూ..సునీల్ సార్.. మీకు మనవడో, మనవరాలో పుట్టి తాతయ్య అయితే మీ ఫీలింగ్ ఏంటని ప్రశ్నించింది.
దీనికి సునీల్ శెట్టి సమాధానం ఇస్తూ..తదుపరి సీజన్‌కి వచ్చే సమయానికి కల్లా తాను తాతయ్యగా అవుతాను అంటూ సునీల్ శెట్టి ఆన్సర్ ఇచ్చాడు. ఆయన సరదాగా అన్నారో లేదా సీరియస్‌గా అన్నారో తెలియదు కానీ చాలామంది కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే అతియా- రాహుల్ శుభ వార్త వినిపించనున్నారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో స్నేహితులుగా ఉన్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ పరిచియాన్ని ప్రేమగా మార్చుకున్నారు.

కేఎల్ రాహుల్, అతియా శెట్టి గురించి అనేక రుమార్స్ తెర మీదకు వచ్చినప్పటికీ ..వాటిపై ఎప్పుడు ఈ జంట స్పందించింది లేదు. 2021లో కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. నాలుగేళ్లు అతియా శెట్టితో డేటింగ్ చేసిన కేఎల్ గతేడాది ఆమెను వివాహం చేసుకున్నాడు. 2023లో భారతీయ సంప్రదాయం ప్రకారం రాహుల్- అతియాల పెళ్లి జరిగింది. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. లక్నో మ్యాచులు జరుగుతున్న సమయంలో అతియా గ్రౌండ్‌కు వచ్చి మరి తన భర్త టీంకు సపోర్ట్ చేస్తోంది. ఇక కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెరెంట్స్‌గా మారబోతున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications