రోహిత్ స్ధానంలో హార్ధిక్ కు ముంబై కెప్టెన్సీ-సూర్య బ్రోకెన్ హార్ట్ ట్వీట్-అన్నీ అందులోనే ?
ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్ధానంలో హార్దిక్ పాండ్యాను తీసుకోవడం పెద్ద వివాదమే రేపుతోంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం భవిష్యత్ అవసరాల పేరుతో తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే పలువురు తాజా, మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ముంబై అభిమానులైతే ఏకంగా 4 లక్షల మందికి పైగా సోషల్ మీడియా అకౌంట్ ను అన్ ఫాలో చేసేశారు. ఇదే క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న స్టార్ బ్యాటర్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపింది.
సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ లో ఇవాళ ఓ ట్వీట్ పెట్టాడు. ఇందులో బ్రోకెన్ హార్డ్ (విరిగిన హృదయం) ఎమోజీని పెట్టి వదిలేశాడు. ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే సూర్యకుమార్ యాదవ్ గురించిన తెలిసిన అతని అభిమానులు మాత్రం దీని అంతరార్ధాన్ని వివరిస్తూ భారీ సంఖ్యలో ట్వీట్లు పెడుతున్నారు. దీంతో స్కై ఉద్దేశపూర్వకంగానే ఈ ట్వీట్ చేశాడా అన్న చర్చ జరుగుతోంది.

ఐపీఎల్ చరిత్రలోనే మహేంద్రసింగ్ ధోనీ తర్వాత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం అభిమానుల్లో ఆగ్రహాన్ని నింపుతోంది. అదీ గుజరాతీ ఆటగాడిని తీసుకొచ్చి ముంబైకి కెప్టెన్ చేయడమే కాకుండా విజయవంతమైన రికార్డు ఉన్న రోహిత్ ను కాదనుకోవడానికి గల కారణాలపై పెద్ద చర్చే పెడుతున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ టీమ్ లో ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్ బ్రోకెన్ హార్డ్ ఎమోజీ పెట్టడంతో రోహిత్ శర్మ తొలగింపును ఉద్దేశించే ఇది పెట్టినట్లు తెలుస్తోంది.
💔
— Surya Kumar Yadav (@surya_14kumar) December 16, 2023
సూర్యకుమార్ ఉద్దేశం రోహిత్ ను సమర్ధిస్తున్నట్లు కనిపిస్తున్నా, అదేనా అంతకు మించి ఇంకేమైనా ఉందా అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది. సూర్య కుమార్ పెట్టిన ఆ ట్వీట్‌కి కేవలం మూడు గంటల్లోనే 52 వేల లైక్‌లు, 11 వేల రీపోస్ట్‌లు, దాదాపు 5 వేల కామెంట్లు వచ్చాయంటే దీని ప్రకంపనలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఇండియా టీమ్ బస్సులో జరిగిన ఓ ఘటన కారణంగా సూర్య ఈ ఎమోజీ పెట్టాడా అన్న చర్చ కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications