T20 World Cup 2026 :టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్..! భారత్-పాక్ మ్యాచ్..!
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ఇవాళ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అలాగే మార్చి 8న ఫైనల్ మ్యాచ్ ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. అలాగే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా పోటీ పడబోతున్నాయి. ఇందులో మరోసారి భారత్-పాకిస్తాన్ లు ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి.
టీ20 వరల్డ్ కప్ లో మొత్తం నాలుగు గ్రూప్ లు ఉన్నాయి. ఇందులో గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా, గ్రూప్ బీలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ, గ్రూప్ సీలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్, గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ ఉన్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ లీగ్ దశలో నాలుగు మ్యాచ్ లు అడనంది. ముంబైలో ఫిబ్రవరి 7న జరిగే తొలి మ్యాచ్ లో భారత్, అమెరికా పోటీ పడతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో భారత్, నమీబియా పోటీ పడతాయి. అలాగే ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్ లో భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ ఉంటుంది. దీంతో భారత్ లీగ్ దశ పోరు ముగుస్తుంది.
The schedule for ICC Men’s @T20WorldCup 2026 is here! 📅
— T20 World Cup (@T20WorldCup) November 25, 2025
The matches and groups were unveiled at a gala event in Mumbai led by ICC Chairman @JayShah, and with new tournament ambassador @ImRo45 and Indian team captains @surya_14kumar and Harmanpreet Kaur in attendance.
✍️:… pic.twitter.com/FlAbAvFO6I
ఈ మెగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడంపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది చాలా గౌరవంగా ఉందన్నాడు. ఆడుతున్నప్పుడు ఎవరూ అంబాసిడర్ గా ఉండటం లేదని తనకు చెప్పారని, గత సంవత్సరం లాగానే, వేరే కుర్రవాళ్లతో కలిసి మనం మ్యాజిక్ సృష్టిస్తామని ఆశిస్తున్నానని తెలిపాడు. ఈ ప్రపంచ కప్ గెలవడం చాలా పెద్ద పని అని, తాను ఈ టోర్నమెంట్‌ను 18 సంవత్సరాలు ఆడానని గుర్తుచేసుకున్నాడు. మొదటిది గెలిచిన తర్వాత, మళ్లీ టైటిల్ కోసం చాలా ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందన్నాడు.
-
ఫైనల్లో హై-వోల్టేజ్ డ్రామా: అర్ష్దీప్, మిచెల్ మధ్య గొడవ! వీడియో -
ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications