T20 World Cup Super 8: సూపర్ 8లోకి ఇంకో రెండు జట్లు-మిగిలింది ఒకే బెర్త్..!
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రేసు(T20 world cup 2026 Super 8)పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఐదు జట్లు సూపర్ 8లోకి ప్రవేశించగా.. ఇవాళ జరిగిన మ్యాచ్ ల ఫలితాలతో మరో రెండు జట్లు ఈ గ్రూప్ లోకి అర్హత సాధించాయి. దీంతో ఇక మిగిలిన ఒకే బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ బెర్త్ భారత్, పాకిస్తాన్, అమెరికాలతో కూడిన గ్రూప్ ఏలోనే ఉంది. దీంతో ఈ పాకిస్తాన్-అమెరికా మధ్య ఈ చివరి బెర్త్ కేసు ఉత్కంఠభరితంగా మారబోతోంది.
కెనడాపై గెలిచి సూపర్ 8కు కివీస్ (super 8)
ఇవాళ చెన్నైలో కెనడాతో జరిగిన వరల్డ్ కప్ గ్రూప్ డీ మ్యాచ్ లో న్యూజీలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెనడా విసిరిన 174 పరుగుల లక్ష్యాన్ని కివీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో న్యూజీలాండ్ గ్రూప్ డీలో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి సూపర్ 8లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే ఈ గ్రూప్ లో దక్షిణాఫ్రికా 6 పాయింట్లు సాధించి సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకుంది.

ఐర్లండ్ తో మ్యాచ్ వర్షార్పణంతో సూపర్ 8కు జింబాబ్వే
ఇక గ్రూప్ బీలో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలేలో ఐర్లండ్-జింబాబ్వే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో గ్రూప్ బీ నుంచి జింబాబ్వే ఐదు పాయింట్లతో సూపర్ 8లోకి ప్రవేశించింది. అలాగే నిన్న శ్రీలంక చేతిలో ఓడిన ఆస్ట్రేలియా ఇవాళ అధికారికంగా వరల్డ్ కప్ నుంచి ఇంటి ముఖం పట్టింది. నాలుగు గ్రూప్ ల నుంచి సూపర్ 8కు చేరిన జట్లలో గ్రూప్ ఏ నుంచి భారత్, గ్రూప్ బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్ సీ నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్, గ్రూప్ డీ నుంచి దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ ఉన్నాయి. ఇక మిగిలింది ఒకే ఒక బెర్తు. అదీ గ్రూప్ ఏ నుంచే ఉంది.

చివరి సూపర్ 8 బెర్త్ కోసం రేపు నమీబియాతో పాక్ పోరు
ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్ సూపర్ 8లోకి అడుగుపెట్టగా.. మరో బెర్త్ కోసం భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్, అమెరికా పోటీ పడాల్సి ఉంది. ఇప్పటికే గ్రూప్ ఏలో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించిన అమెరికా రెండో స్ధానంలో ఉంది. కానీ మ్యాచ్ లు మిగిలి లేవు. అయితే నాలుగు పాయింట్లు సాధించినా అమెరికా కంటే తక్కువ రన్ రేట్ తో ఉన్న పాకిస్తాన్ కు చివరి మ్యాచ్ రేపు నమీబియాతో మిగిలి ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సూపర్ 8 చేరాలని పాక్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో పాక్ ఓడినా, గెలిచి నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్నా అమెరికాకు సూపర్ 8 చేరే ఛాన్స్ లభిస్తుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications